28.4.26

బధిరులకు ఆశాకిరణంగా టిటిడి విద్యాసంస్థలుttd institurtiions




టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ బధిరోన్నత పాఠశాలఎస్వీ బధిరుల జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారుపూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 01, 2026 వరకు స్వీకరిస్తారు.


తిరుపతిభీమవరంవరంగల్ ప్రాంతాల్లోని  విద్యాసంస్థల్లో చేరదలచిన బధిర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చుఅభ్యర్థులను సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందిప్రతి ఏడాది 1 తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పించబడతాయిఇతర తరగతుల్లో ఖాళీల మేరకు ప్రవేశాలు ఉంటాయి.


తిరుపతిలో 1 తరగతి చేరాలనుకునే అభ్యర్థులకు, 2 తరగతి నుండి 9  తరగతి వరకు ఖాళీలను బట్టి ప్రవేశాలు కల్పిస్తారుసదరు తరగతులతో పాటు ఇంటర్మీడియట్ మెదటి సంవత్సరం ప్రవేశాలకు తిరుపతి కళాశాల లేదా వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు


దరఖాస్తులను తిరుపతి ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాల నుండి నేరుగా పొందవచ్చు లేదా www.tirumala.org

 వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చుపూర్తి చేసిన దరఖాస్తులను ఇంఛార్జి ప్రిన్సిపాల్ఎస్వీడిఎఫ్అలిపిరితిరుపతి – 517501 చిరునామాకు పంపాలి.


ఎస్వీ బధిరోన్నత పాఠశాలఎస్వీ బధిరుల జూనియర్ కళాశాల నేపథ్యం


తిరుపతి అలిపిరి సమీపంలో టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ బధిరోన్నత పాఠశాల మరియు ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాల బధిర విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యాలను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.


 జూలై 25, 1974 సంవత్సరంలో 17 మంది బధిర విద్యార్థులతో అప్పట్లో టిటిడి ఛైర్మెన్ శ్రీ సిఅన్నారావు గారు ప్రారంభించారుదశలవారీగా తరగతులను పెంచుకుంటూ ప్రస్తుతం 1 తరగతి నుండి 10 తరగతి వరకు శ్రీ వేంకటేశ్వర బధిరోన్నత పాఠశాలఇంటర్మీడియట్ లో హెచ్..సీసీఈసీ గ్రూప్ లతో శ్రీ వేంకటేశ్వర బధిరుల జూనియర్ కళాశాలను (2008 నుండిటిటిడి నిర్వహిస్తోందివిద్యతో పాటు డ్రాయింగ్టైలరింగ్బుక్ బైండింగ్ , యోగ లాంటి నైపుణ్య  వృత్తులలో శిక్షణ ఇస్తోంది.


ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ ఎస్వీ బధిరోన్నత పాఠశాలలో 1 తరగతి నుండి 10 తరగతి వరకు 231 మంది బధిర విద్యార్థినివిద్యార్థులుఎస్వీ బధిరుల జూనియర్ కళాశాలలో 162 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారుపశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో 1985 ఏడాది నుండిప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో 1987 ఏడాది నుండి బధిర విద్యార్థుల కోసం పాఠశాలలను ప్రారంభించారుప్రస్తుతం భీమవరంలో 80 మందివరంగల్ లో 166 మంది బధిర విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.


ఎస్వీ బధిరోన్నత పాఠశాలఎస్వీ బధిరుల జూనియర్ కళాశాలలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులయ్యారుటిటిడి ప్రతి ఏడాది బధిర విద్యార్థిని విద్యార్థుల పురోగతి కోసం సుమారు రూ.3.50 కోట్లు పైచిలుకు ఖర్చు చేస్తోందిఏడాదికోసారి తిరుపతితిరుమల ఆలయాలకు తీసుకెళ్తారుటిటిడి బధిరోన్నత పాఠశాలఎస్వీ బధిరుల కళాశాల యందు విద్యను అభ్యసించిన విద్యార్థినివిద్యార్థులు టిటిడిలో పలు విభాగాల్లోప్రభుత్వప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు.


 సంస్థల ద్వారా బధిర విద్యార్థులకు నాణ్యమైన విద్యవసతిభోజనంవైద్య సంరక్షణసంకేత భాష ఆధారిత బోధననైతిక విలువలు మరియు వృత్తి నైపుణ్యాల అభివృద్ధిలో  శిక్షణ అందిస్తున్నారుఅనుభవజ్ఞులైన ఉపాధ్యాయులుఆధునిక బోధనా పద్ధతులుప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ద్వారా విద్యార్థులను స్వావలంబన దిశగా తీర్చిదిద్దుతూ సమాజంలో సమాన అవకాశాలు కల్పించడమే  సంస్థల లక్ష్యంబధిర విద్యార్థులకు ఒక ఆశాకిరణంగా నిలుస్తున్న  విద్యాసంస్థలు టిటిడి సేవా సంకల్పానికి స్ఫష్టమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మే2 నుండి 8 వరకు వైభవంగా పదకవితా పితామహుడు అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాలు annamcharya




సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 618 జయంతి ఉత్సవాలు మే 2 నుండి 8వ‌ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయిఅన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరంరాజంపేటలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం ద్దతిరుపతిలోని మహతి కళాక్షేత్రంఅన్నమాచార్య కళామందిరంల‌లో జయంతి కార్యక్రమాలను  నిర్వహించనున్నారు.


తాళ్లపాకలో..


తాళ్లపాకలోని ధ్యానమందిరంలో మే 2 తేదీన ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయిమొదటగా న్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులు మరియు స్థానిక కళాకారులచే సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం నిర్వ‌హిస్తారుఅనంత‌రం ఉద‌యం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి కల్యాణం క‌న్నుల పండుగ‌గా జ‌రుగ‌నుంది.  


ఇందులో భాగంగా మే 2 నుండి 8 తేదీ వ‌ర‌కు ప్ర‌తి రోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల రకు గాత్ర సంగీతంహరికథనృత్యనాటక ప్ర‌ద‌ర్శ‌న‌ కార్యక్రమాలు జరుగనున్నాయి.  


రాజంపేట‌లోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద మే 2 తేదీ సాయంత్రం 6.30 గంట‌లకు ఊంజల్ సే జ‌రుగ‌నుందిఅదేవిధంగా మే 2 నుండి 8 తేదీ వ‌ర‌కు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు సంగీతవాద్య‌హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.


తిరుపతిలో..


తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 2 తేదీ ఉదయం 9 గంటలకు సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానంతో జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయిఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు సంగీత స‌భఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు హ‌రిక‌థ గానం జ‌రుగ‌నుంది.


మే 3 నుండి 7 తేదీ వ‌ర‌కు ఉదయం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు సాహిత్య సదస్సులు జరుగనున్నాయిమే 8 తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారుఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 1 గం వ‌ర‌కు సంగీత స‌భ‌హ‌రిక‌థ గానం జ‌రుగ‌నుంది.  


ఇందులో భాగంగా మే 2 నుండి 8 తేదీ వ‌ర‌కు ప్ర‌తి రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు గాత్ర సంగీతంనృత్యవాద్య‌హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.  


మహతి కళాక్షేత్రంలోనూ మే 2 నుండి 8 తేదీ వరకు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత,  నృత్యవాద్య‌ కార్యక్రమాలు జరుగనున్నాయి.  


భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నమయ్య సంకీర్తనల సౌరభాన్ని ఆస్వాదించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.


Temple-Wise Festivals in May at Tiruchanoor and Sub Temples




Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor:


Friday Tiruchi Utsavams (May 1, 15, 22, 29 at 6 PM); Swarna Ratham (May 1, 9:30 AM); Vasanthotsavams conclude on May 2; Gaja Vahanam (May 8, 6:45 PM).


Sri Sundararaja Swamy Temple:


Tiruchi Utsavam on May 13 at 7 PM.


Sri Balarama Krishna Swamy Temple:


Tiruchi Utsavam on May 18 at 7 PM.


Sri Suryanarayana Swamy Temple:


Tiruchi Utsavam on May 27 at 5 PM.


Sri Srinivasa Swamy Temple:


Abhisekams on May 2, 9, 16, 23, 30 at 8 AM.


Appalayagunta Sri Prasanna Venkateswara Swamy Temple:


Friday sevas (May 1, 8, 15, 22, 29 at 7 AM); Ashtadala Padapadmaradhana (May 5, 8 AM); Kalyanotsavam (May 9, 10:30 AM); Ashtottara Kalasabhishekam (May 13, 8 AM); Sri Prasanna Anjaneya Swamy Abhisekams (May 3, 10, 17, 24, 31 at 8:15 AM).