16.5.26

గోమాతల పరిరక్షణలో దాతల సహకారం ప్రశంసనీయం : టిటిడి జేఈవో డా. ఎ. శరత్ ttd jeo







టిటిడి ఎస్వీ గోశాలకు భక్తులు, దాతలు విరాళంగా అందించిన 180 లారీల ఎండుగడ్డిని కాల వర్షాల నుండి రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. . శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో కలిసి ఎస్వీ గోశాలను పరిశీలించిన ఆయన, గోవు సంరక్షణ, ఎండుగడ్డి నిల్వలు, మౌలిక సదుపాయాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.


సందర్భంగా గోమాతల సేవలో భాగంగా ఎండుగడ్డి దానాన్ని అందించిన టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీనివాస సేవా ట్రస్ట్ ఛైర్మన్ శ్రీ టి. సత్యనారాయణలను జేఈవో ప్రత్యేకంగా అభినందించారు.


 గోసంరక్షణ మహోన్నతమైన ధార్మిక సేవ అని పేర్కొంటూ, గోవుల పరిరక్షణకు మరింత మంది దాతలు ముందుకు వస్తే టిటిడి సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.


గోశాలకు దానంగా వచ్చిన ఎండుగడ్డిని శాస్త్రీయ విధానంలో విభజించి నిల్వ చేయాలని, వర్షాల ప్రభావం లేకుండా టార్పాలిన్ కవర్లతో భద్రపరచాలని అధికారులకు సూచించారు. గోవులకు ఎటువంటి ఆహార కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్పరిశీలన


టిటిడి ఆధ్వర్యంలో స్వదేశీ ఆవుల జన్యు పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యంగా నిర్మాణంలో ఉన్నసెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జేఈవో సూచించారు.


సెంటర్ పూర్తయిన అనంతరం పాలు ఇచ్చే ఆవుల సంఖ్య, భవిష్యత్తులో అవసరమయ్యే పాల ఉత్పత్తి సామర్థ్యం, పాలు సేకరణ, నెయ్యి తయారీ, పెరుగుమజ్జిగ పంపిణీ, మానవ వనరుల వినియోగం తదితర అంశాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పూర్తయితే ప్రతి షెడ్లో 250 ఆవుల సామర్థ్యంతో గోవులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు. అలాగే గోవుల మేటర్నిటీ షెడ్, ఆధునిక మిల్కింగ్ పార్లర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు


కార్యక్రమంలో టిటిడి ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవీఎన్ శివకుమార్, డిఈ శ్రీ దామోదర్, మేనేజర్లు మృదుల, గౌరీ, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.


Grand Arrangements for Sri Govindaraja Swamy Vari Brahmotsavams





TTD JEO Sri V. Veerabrahmam directed officials to make elaborate arrangements for the annual Brahmotsavams of Sri Govindaraja Swamy Temple from May 23 to 31. He reviewed the arrangements with officials on Friday evening.


The JEO instructed officials to ensure smooth darshan of the presiding deity along with hassle-free vehicle sevas for devotees. He directed the Engineering, Electrical and Garden departments to make special arrangements including queue lines, decorative lighting, flower decorations, arches and flex boards.


He also instructed officials to arrange sufficient Srivari Sevaks, sanitation staff, medical aid centres, ambulances and fire safety services. Spiritual and cultural programmes, bhajans and kolatams will also be organised daily during the festivities.


Deputy EO Smt. Shanthi, VGO Sri Giridhar, Additional Health Officer Dr. Sunil, AEO Sri Narayana Chowdary and other officials attended the meeting.

టీటీడీ ఇన్నోవా కారు విరాళం donation




చెన్నైకు చెందిన పోసన ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ శ్రీ మగేష్ సుందర్ శుక్రవారం టీటీడీకి రూ.40 లక్షలు విలువచేసే టోయోటా ఇన్నోవా హైక్రాస్ వి.జెడ్ మోడల్ కారును విరాళంగా అందించారు


మేరకు దాత శ్రీవారి ఆలయంలో ముందు కారుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు కారు తాళాలు అందజేశారు.


కార్యక్రమంలో టీటీడీ డీఐ శ్రీ కృష్ణయ్య పాల్గొన్నారు.


Donor's Support in Cow Protection is Commendable - TTD JEO






TTD JEO (Health & Education) Dr. A. Sharath directed officials to take immediate steps to protect 180 lorry loads of dry fodder donated to TTD SV Goshala from unseasonal rains. He inspected the goshala on Friday along with officials and reviewed cow protection measures, fodder storage and infrastructure facilities.


The JEO appreciated TTD Board Member Sri Jyothula Nehru, Nehru Foundation and Srinivasa Seva Trust Chairman Sri T. Satyanarayana for donating dry fodder to the goshala. He said cow protection is a sacred service and assured full support from TTD to donors coming forward for gosamrakshana.


He instructed officials to safely store the fodder with tarpaulin covers and take advance measures to avoid any shortage of feed for cows.


Later, the JEO also reviewed the ongoing works of the “Centre of Excellence” being developed for conservation and improvement of indigenous cow breeds. He directed officials to speed up the pending works and prepare a detailed action plan on milk production, ghee preparation, curd and buttermilk distribution and manpower utilization.


TTD SV Goshala Director Dr. AVN Sivakumar, DE Sri Damodar, managers Mridula and Gowri, Assistant Director Sri Parthasarathi and others. 

Grand Response to Sri Srinivasa Divyanugraha Visesha Homam




TTD’s spiritually significant “Sri Srinivasa Divyanugraha Visesha Homam” being conducted daily at Alipiri is receiving overwhelming response from devotees.


The divine Homam, performed amid Vedic chants from 9 am to 11 am every day, offers devotees an opportunity to seek the blessings of Lord Venkateswara.


 Couples participating in the Homam will also be provided with Special Entry Darshan.


To accommodate more devotees, TTD is constructing a permanent and spacious Yagashala at a cost of Rs.7 crore with seating capacity for 500 grihasthas at a time.


Devotees can participate in the Homam on special occasions like birthdays and wedding anniversaries by booking tickets online through https:// ttdevasthanams.ap.gov.in.

అత్యంత వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు వాహనసేవలతో పాటు భక్తులకు మూలమూర్తి దర్శనం కల్పించాలి : జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం brahmotsavams





తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించాలని టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం ఆలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


సందర్భంగా జేఈవో మాట్లాడుతూ మే 23 ధ్వజారోహణంతో ప్రారంభమై, మే 31 ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు వాహనసేవలతో పాటు మూలమూర్తి దర్శనం సైతం సాఫీగా కల్పించేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్ విభాగం ద్వారా క్యూలైన్లు, లువపందిళ్లు, కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో ఆలయం పరిసరాలను దేదీప్యమానంగా విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు ఆర్చీలు, కటౌట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


బ్రహ్మోత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాలల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు భజనలు, కోలాటాలు నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తాలని సూచించారు.


అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్ కేంద్రాలు, అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా టిటిడి విజిలెన్స్, పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.


సమావేశంలో డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, విజివో శ్రీ గిరిధర్, ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, అదనపు ఆరోగ్య అధికారి డా.సునీల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.