17.5.26

వైభవోపేతంగా శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు brahmotsavams




తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31 తేదీ రకు అత్యంత వైభవంగా, మరింత ఆధ్యాత్మిక శోభ కనిపించేలా నిర్వహించనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను టిటిడి జేఈవో లు శ్రీ వి వీరబ్రహ్మం, డా. .శరత్, సివిఎస్వో శ్రీ కే వి మురళీకృష్ణ లతో కలిసి టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర శనివారం ఆవిష్కరించారు.


 తిరుపతిలోని టీటీడీ నివాస గృహంలోని ఈవో ఛాంబర్‌లో కార్యక్రమం జరిగింది.


సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయ వైభవాలకు ప్రతీకగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో విశేష ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లగకుండా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.


ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళ కళ లాడేలా చలువ పందిళ్లు, ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు, రంగురంగుల ముగ్గులు, పుష్పాలంకరణలు, వైట్ పెయింటింగ్‌, సాంప్రదాయ చిత్రకళా అలంకరణలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.


మే 22 సాయంత్రం 5.30 గంటల నుండి 8 గంటల వరకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మే 23 ఉదయం 7.35 గంటల నుండి 8.49 గంటల వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.


ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు నిర్వహించనున్న వాహనసేవలు భక్తి పారవశ్యాన్ని పంచనున్నాయి. ముఖ్యంగా మే 27 గరుడవాహన సేవ, మే 30 రథోత్సవం బ్రహ్మోత్సవాలకు ఆకర్షణగా నిలవనున్నాయి.


వాహనసేవల విశేషాలు


24.05.2026 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం


25.05.2026 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం


26.05.2026 – ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం


27.05.2026 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి రుడ వాహనం


28.05.2026 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం


29.05.2026 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం


30.05.2026 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం


31.05.2026 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం


బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

TTD Strongly Condemns Allegations Against Srivari Tickets Booking System




TTD reiterated that the SRIVANI online ticket booking system is completely transparent.

The online Srivani ticket system, which was launched in May 2019 in collaboration with TCS, continues to be in operation. Based on requests from devotees, the offline system—where tickets were issued on a day-to-day basis in Tirumala—was modified. Under this revised system, the software has been designed to allocate tickets on a "first-come, first-served" basis to those who access the application first.


Thousands of devotees attempt to secure tickets daily. Consequently, within the first minute and a half of availability, the system locks the tickets for those who accessed the application earliest. Subsequently, tickets are issued to those who successfully complete their payment via the payment gateway. If, for any reason, a payment fails to process, the corresponding tickets  returns to the general pool. This process is a standard practice implemented in services such as IRCTC and other government-run advance booking systems. 


Human intervention has been completely eliminated from this entire process.  The system operates automatically.


It is indeed true that tickets are issued after a delay of ten minutes. This is because the software has been designed to retrieve tickets—and make them available to devotees once again—in instances where TTD does not receive a confirmation message regarding the deposit of funds, whether due to technical glitches at the payment gateway during the transaction or for other reasons.


A qualified person coupled with an extensive 32 years of experience in the IT sector, was appointed solely as the GM (IT) [FAC] (Full Additional Charge) on a stop-gap arrangement.


In the interest of devotee convenience, TTD has completely abolished the use of "auto-filling" and "copy-paste" mechanisms, thereby ensuring equal opportunities for all.  


Furthermore, all systems within the TTD undergo an annual audit conducted through AP Technology Services (APTS).


The demonstration of the Srivani ticket booking process, presented by the former TTD Chairman during today's press conference, did not appear to be executed with a complete understanding of the system. During his attempt to book a ticket, he proceeded as far as the payment gateway stage. He subsequently characterized this outcome as a "technical glitch." However, the transaction was rejected at the payment gateway because his account lacked sufficient funds. 


Consequently, when he attempted the process again, it was technically registered as a fresh attempt by the system. 


By that time, the system had already prioritized other users who were ahead of him in the queue. As a result, he fell behind in the waiting list. Only technological experts know and understand well about these technical nuances.





శ్రీవాణి టికెట్లు, టీటీడీ ఐటీ వ్యవస్థపై వ‌స్తున్న‌ ఆరోపణలు పూర్తిగా స‌త్య దూరం : టీటీడీ ttd condemns




భ‌క్తుల‌కు టీటీడీ వ్య‌వ‌స్థీకృతంగా, పార‌ద‌ర్శకంగా శ్రీ‌వాణి ఆన్ లైన్ విధానాన్ని క్రింది విధంగా అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంది


టీసీఎస్ స‌హ‌కారంతో 2019 మే నెల‌లో మొద‌లుపెట్టిన ఆన్ లైన్ శ్రీ‌వాణి టికెట్ విధానాన్నే కొన‌సాగించ‌డం జ‌రుగుతోంది. భ‌క్తుల విజ్ఞ‌ప్తి మేర‌కు ఆఫ్ లైన్ ద్వారా తిరుమ‌ల‌లో ఏరోజుకారోజు జారీ చేసే విధానాన్ని మార్పు చేయడం జ‌రిగింది. మార్పు చేసిన విధానంలో ముందు ఎవ‌రైతే సాప్ట్ వేర్ అప్లికేష‌న్ యాక్సెస్ చేస్తారో వారికే టికెట్ వ‌చ్చే విధంగా సాఫ్ట్ వేర్ త‌యారు చేయ‌డ‌మైన‌ది. రోజుకి వేల సంఖ్య‌లో టికెట్లు పొందుట కొర‌కు భ‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్నారు. అందువ‌ల్ల మొద‌టి ఒక‌టిన్న‌ర నిమిషంలోపే ముందు వ‌చ్చిన వారికి ముందు ఇచ్చే విధానంలో లాక్ చేయ‌డం జ‌రుగుతోంది. త‌దుప‌రి పేమెంట్ గేట్ వే లో విజ‌యవంతంగా డ‌బ్బులు చెల్లించిన‌వారికి టికెట్లు జారీ చేయ‌డం జ‌రుగుతోంది. ఏదైనా కార‌ణం వ‌ల్ల డ‌బ్బులు చెల్లింపులు జ‌ర‌గ‌ని ఎడ‌ల అట్టి టికెట్ల‌ను తిరిగి పూల్‌లోకి తీసుకురావ‌డం జ‌రుగుతోంది. ప్ర‌కియ ఐఆర్‌సీటీసీ మ‌రియు ప్ర‌భుత్వ ఇత‌ర‌ అడ్వాన్స్ బుకింగ్ స‌ర్వీసుల్లో ప్రవేశ‌పెట్ట‌బ‌డి ఉన్న‌ది. విధానంలో మానవ ప్రమేయం పూర్తిగా తీసివేయడం జరిగింది. సిస్టమ్ ఆటోమేటిక్ గా పని చేయడం జరుగుతుంది.


ప‌ది నిమిషాల త‌ర్వాత ట‌కెట్లు జారీ చేయ‌డం వాస్త‌వ‌మే. ఎందుకంటే పేమెంట్ గేట్ వే వ‌ద్ద చెల్లింపు స‌మ‌యంలో సాంకేతిక లోపం లేదా ఇత‌ర కార‌ణాల చేత టీటీడీకి డ‌బ్బు జ‌మ అయిన‌ట్లు మెసేజ్ రాకుంటే అలాంటి టికెట్ల‌ను తిరిగి పూల్ లోకి తీసుకొచ్చి భ‌క్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేయ‌బ‌డంది.


జీఎం ఐటీగా క‌నీస అర్హ‌త‌లు లేని వ్య‌క్తిని నియ‌మించార‌ని చెప్ప‌డం వాస్త‌వ విరుద్ధం. వారికి ఎం.టెక్ (కంప్యూట‌ర్ సైన్స్) మ‌రియు ఎం.ఎస్ (ఇన్న‌ర్మేష‌న్ సిస్ట‌మ్స్) అర్హ‌త‌తో పాటుగా 32 సంవ‌త్స‌రాలుగా ఐటీలో సుదీర్ఘ అనుభ‌వం ఉండ‌టంతో స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద వారిని జీఎం ఐటీ ఎఫ్ఏసీగా మాత్రమే నియ‌మించ‌డం జ‌రిగింది


ఇక సాఫ్ట్వేర్ కు సంబంధించి టీసీఎస్ కొత్త‌గా సాప్ట్ వేర్ తీసుకురాలేదు. 2019 లో తీసుకొచ్చిన సాప్ట్ వేర్ నే వినియోగంలో ఉంచి ఎప్ప‌టిక‌ప్పుడు భ‌క్తుల నుండి వ‌చ్చే స‌ల‌హాలు, సూచ‌న‌ల మేర‌కు కాలానుగుణంగా టీసీఎస్ ద్వారా సాప్ట్ వేర్ ను మార్పు చేయ‌డం జ‌రుగుతోంది.


భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఆటో ఫిల్లింగ్‌, కాపీ,పేస్ట్ ప్ర‌క్రియ  విధానాలను పూర్తిగా ర‌ద్దు చేసి అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పిస్తోంది. త‌ర్వాత టీటీడీలో ఉన్న అన్ని సిస్టమ్స్ ఆడిట్ ల‌ను ఏపీ టెక్నాల‌జీ స‌ర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా ప్ర‌తి సంవ‌త్స‌రం ఆడిట్ చేయించ‌డం జ‌రుగుతోంది.


ఈరోజు ప్రెస్ మీట్ లో టీటీడీ మాజీ చైAర్మ‌న్ ప్ర‌ద‌ర్శించిన శ్రీ‌వాణి టికెట్ బుకింగ్ ప్రక్రి పూర్తి అవగాహనతో చేసినట్లు అనిపించలేదు. వారు టికెట్ బుక్ చేసుకునే స‌మ‌యంలో పేమెంట్ గేట్ వే వ‌ర‌కు వెళ్ల‌డం జ‌రిగింది. దీనిని వారు సాంకేతిక లోపం అని తెలిపి ఉన్నారు. కానీ వారి అకౌంట్‌లో స‌రిప‌డ న‌గ‌దు లేనందు వ‌ల్ల పేమెంట్ గేట్ వే ద‌గ్గ‌ర వారి ట్రాన్సాక్ష‌న్ రిజెక్ట్ చేయ‌బ‌డింది. అటు పిమ్మ‌ట వారు తిరిగి ప్ర‌య‌త్నించ‌డం వ‌ల్ల అది సాంకేతికంగా కొత్త‌ ప్ర‌య‌త్నం కిం లెక్కింప‌బ‌డుతుంది. అప్ప‌టికే వారి ముందున్న వారిని సిస్ట‌మ్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుంది. దీనితో వీరు వెయిటింగ్ లిస్టులో వెనుకబడి ఉన్నారు. అంశాలు సాంకేతిక ప‌రిజ్ఞానం ఉన్న వారికి మాత్ర‌మే అర్థ‌మ‌వుతుంది.


Online Darshan Accommodation Quota for August




The details regarding the online quota of various arjita sevas, darshans and accommodation to be released by the TTD for the month of August are as follows:


Srivari Arjitha Seva tickets (Suprabhatam, Thomala, Archana, and Ashtadala Padapadmaradhana Seva) on May 18th at 10AM.


Registration for these Seva tickets via the Electronic Dip system will be open online until 10AM on May 20.


Tickets will be allotted to those who successfully make the payment between May 20 and 12noon on May 22.


TTD will release the online quota for Kalyanam, Unjal Seva, Arjitha Brahmotsavam, and Sahasra Deepalankara Seva tickets on May 21 at 10AM. Similarly, the tickets related to annual Pavitrotsavams (23-08-26 to 25-08-26) will also be released on May 21 at 10AM, while the Virtual Sevas and their corresponding Darshan slots on May 21 at 3PM.


The online quota for Anga Pradakshinam tokens will be released on May 23 at 10 AM and Srivani Trust Darshan tickets at 11AM, for the elderly, differently-abled, and those suffering from chronic illnesses, the at 3PM.


The Special Entry Darshan tickets will be released on May 25 at 10AM and

 for accommodation in Tirumala and Tirupati will be released online on the 25th at 3:00 PM.


Devotees are requested to book Srivaru’s Arjitha Sevas and Darshan tickets through the website https://ttdevasthanams.ap.gov.in.