23.5.26

తిరుమలలో భక్తుల రద్దీ నిర్వహణకు పకడ్బందీ చర్యలు rush







వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్‌. వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడుతో క‌లిసి  శుక్రవారం సాయంత్రం తిరుమలలోని దర్శన క్యూలైన్లు, ట్రాఫిక్‌, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను త‌నిఖీ చేశారు.


సందర్భంగా అద‌న‌పు ఈవో భక్తులతో స్వయంగా మాట్లాడి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ పంపిణీ, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు.


అనంతరం ఆయ‌న‌ మీడియా తో మాట్లాడుతూ భక్తుల రద్దీ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీస్‌ శాఖ, టీటీడీ విజిలెన్స్‌, ఇతర విభాగాలు సమన్వయంతో 24×7 పాటు ఆకుంఠిత దీక్ష తో పనిచేస్తున్నాయని చెప్పారు.


క్యూలైన్లలో భక్తులను క్రమబద్ధంగా పంపిస్తూ తొక్కిసలాటలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. శుక్ర‌వారం  అత్యధిక సంఖ్యలో వాహనాలు తిరుమలకు వచ్చినప్పటికీ, ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో 320కు పైగా ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నామని, అదనంగా ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా మరో 100కు పైగా ట్రిప్పులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.


క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగను నిరంతరాయంగా అందిస్తున్నామని చెప్పారు. రోజుకు సుమారు నాలుగు లక్షల మందికి సరిపడా అన్నప్రసాదాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.  రోజుకు దాదాపు 45 వేల లీటర్ల మజ్జిగ, 50 వేల లీటర్ల పాలను భక్తులకు అందిస్తున్నామని చెప్పారు. అన్ని విభాగాలు షిఫ్టుల వారీగా 24 గంటలపాటు పనిచేస్తుండగా, మొబైల్ టీమ్స్‌, కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా వివిధ విభాగాల మ‌ధ్య‌ సమన్వయాన్ని మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు. అదనపు శ్రీవారి సేవకులను నియమించి భక్తులకు సేవలను మరింత విస్తరించామని తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా అన్నమాచార్య కీర్తనలు, శ్రీవారి మహత్యాన్ని నిరంతరం ప్ర‌సారం చేస్తున్నామని చెప్పారు.


సంద‌ర్భంగా భక్తులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్జ‌ప్తి చేశారు. భ‌క్తుల‌కు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించే విధంగా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు


తిరుమలలో అంబులెన్సులు, వైద్య సేవలు, ఫుట్‌పాత్ ల‌ వద్ద సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.


తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు మాట్లాడుతూ మే నెల ప్రారంభం నుంచే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. రైల్వే స్టేషన్‌, బస్ స్టాండ్‌, శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి, శ్రీవారి మెట్లు తదితర ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. తిరుమలలో అదనపు ఎస్పీ స్థాయి అధికారితో పాటు డీఎస్పీలు, ప్రత్యేక బృందాలు 24 గంటలపాటు విధులు నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. రోజుకు సుమారు 16 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తున్నామని పేర్కొన్నారు.


టీటీడీ విజిలెన్స్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాయని వెల్లడించారు. భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అన్ని విభాగాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే డయల్‌-100 లేదా టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని భక్తులకు సూచించారు.


త‌నిఖీల్లో డిప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథం, శ్రీ రాజేంద్ర‌, శ్రీ సోమ‌న్నారాయ‌ణ‌, శ్రీ శ్రీనివాస్, వీజీవో శ్రీ సురేంద్ర‌, హెల్త్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ సుధారాణి, ఇత‌ర టీటీడీ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


TTD Records Highest Ever Thursday Darshan Fitures




In a rarest fete of its sorts, TTD has successfully managed to provide dardhan to 79000 plus devotees on May 21 and also allowed over 5850 common devotees during Abhisheka Seva on Friday, asserted the TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary.

Speaking to media outside the Srivari temple on Friday morning, the Additional EO said, through the Integrated AI Command Control Centre, with a proper Time, queue and Dardhan management schedule besides collective efforts of various departments, the sharp rise in pilgrim traffic during the summer holidays is being handled in a  smooth manner ensuring comfortable darshan for common devotees.

Through this effective pilgrim influx forecasting and continuous monitoring, there is a substantial increase in daily darshans, facilitating darshan for over 15,000 additional devotees every day, he maintained

Despite Thursdays traditionally having reduced darshan hours due to weekly rituals, TTD facilitated darshan to a record number of 79, 603 devotees for the first time, demonstrating the institution’s operational efficiency, he said.

Senior officials are reviewing queue-line conditions hourly and implementing necessary measures immediately to expedite the darshan process. The

Coordinated efforts between TTD departments, Vigilance, and Police wings have helped manage the summer rush, and all departments are working round the clock to ensure uninterrupted supply of drinking water, Annaprasadam, medical services and amenities in queue lines for devotees, he maintained.

Reiterating that providing comfortable and speedy darshan to common devotees is the primary objective of TTD, the additional EO said that the entire administrative machinery is committed to working with dedication to this end.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




బెంగుళూరుకు చెందిన తరుణ్ గౌడ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు శుక్రవారం రూ.10,10,001 విరాళంగా అందించారు.


మేరకు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

22.5.26

మే 22న శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ankurarpanam











తిరుపతి లోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 23 నుండి 31 తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు మే 22 శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుండి 8 గంటల మధ్య కార్యక్రమం వైభవంగా జరుగనుంది.


ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన సేవలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, గంగుండ్ర మండపంలో ఆస్థానం, యాగశాలలో శాస్త్రోక్త అంకురార్పణ కార్యక్రమాలు జరుగుతాయి.


ఆలయ ప్రాశస్త్యం 


కలియుగ వైకుంఠమైన తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం భక్తి, చరిత్ర, శిల్పకళ, ఆగమ సంప్రదాయాల సమ్మేళనంగా యుగయుగాలుగా భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తోంది. ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులకు రుణ విమోచనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతాయని స్థల పురాణం పేర్కొంటోంది. స్వామివారి దివ్య మంగళ విగ్రహం భక్తుల హృదయాలలో విశ్వాసాన్ని నింపుతూ, జీవన సాఫల్యానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.


స్థల పురాణ వైభవం


పురాణాల ప్రకారం, శ్రీ మహావిష్ణువు భూలోకంలో శ్రీనివాసుడిగా అవతరించి తిరుమలలో నివసించే సమయంలో వివాహ మహోత్సవం నిమిత్తం కుబేరుని వద్ద నుండి ధనం అప్పుగా తీసుకున్నారని విశ్వసిస్తారు. ఆ ధనాన్ని కొలిచే బాధ్యతను శ్రీనివాసుడి అన్నయ్య అయిన శ్రీ గోవిందరాజ స్వామివారికి అప్పగించారని స్థల పురాణం తెలియజేస్తోంది. ధనాన్ని కొలుస్తూ అలసిన స్వామివారు ఆదిశేషునిపై శయనించిన దివ్య రూపమే నేటి శ్రీ గోవిందరాజ స్వామివారి దర్శనమని భక్తుల విశ్వాసం.


గర్భాలయంలో దివ్య దర్శనం


ఆదిశేషునిపై శయనిస్తున్న స్వామివారు గర్భాలయంలో దివ్య కాంతులతో దర్శనమిస్తూ భక్తుల హృదయాలకు ప్రశాంతతను ప్రసాదిస్తున్నారు. స్వామివారి నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించినట్లు, పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, మోక్షం కోసం తపస్సు చేస్తున్న మధు–కైటభ రాక్షసులు కొలువై ఉన్న దృశ్యం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది.


దర్శనంనిత్య సేవలు


ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారి సేవలు ప్రారంభమవుతాయి. ఉదయం 5.30 గంటలకు విశ్వరూప దర్శనం, 6.30 గంటలకు తోమాల సేవ, 7.30 గంటలకు అర్చన, 8 గంటలకు అర్చనానంతర దర్శనం నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవతో నిత్య కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ సేవల్లో పాల్గొనే భక్తులు అపార ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు.


భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు


శ్రీ గోవిందరాజ స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు  చక్కెర పొంగలి, అన్నం, సాంబారు, రసం, కర్రీ, చట్నీ, మజ్జిగతో రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారు. 


అదేవిధంగా, ఆలయం సమీపంలోని పాత మ్యూజియంలో ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదాలను అందిస్తున్నారు. 


2026 ఫిబ్రవరి నెల నుండి సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాంబారు అన్నం, పెరుగు అన్నం కూడా పంపిణీ చేస్తున్నారు.


రాజగోపుర శిల్ప వైభవం


ఆలయంలోకి ప్రవేశించగానే దర్శనమిచ్చే ఏడు అంతస్తుల మహారాజగోపురం విజయనగర శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. స్థానిక పాలకుడు మట్ల అనంతరాజు నిర్మించిన ఈ గోపురం ద్రావిడ, విజయనగర నిర్మాణ శైలుల సమ్మేళనంగా శతాబ్దాలుగా భక్తులను ఆకట్టుకుంటోంది.


మూడు అంతస్తులతో నిర్మించిన పడి కావిలి గోపురం, మహాద్వార గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, విమాన గోపురం బంగారు తాపడంతో దివ్య కాంతులను విరజిమ్ముతోంది.


బంగారు తాపడంమహాసంప్రోక్షణ


ఆలయంలో 70 సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన పాత ధ్వజస్తంభం స్థానంలో 2018 ఏప్రిల్ 7న నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. అనంతరం 2018 ఏప్రిల్ 12న వైఖానస ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ నిర్వహించారు.


ఆలయ విమాన గోపురానికి 100 కిలోల బంగారంతో తాపడం పనులను 2021 సెప్టెంబర్ 14న ప్రారంభించి, 2023 మే 25న బంగారు తాపడం విమాన గోపుర మహాసంప్రోక్షణను అత్యంత వైభవంగా నిర్వహించారు.


క్షేత్ర వైభవం


ఈ మహాక్షేత్రంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి స్థానక రూపంలో, శ్రీ పార్థసారథి స్వామివారు ఆసీన రూపంలో, శ్రీ గోవిందరాజ స్వామివారు శయన రూపంలో దర్శనమిస్తారు. ఒకే ప్రాంగణంలో నిల్చున్న, కూర్చున్న, శయనించిన విష్ణుమూర్తుల సన్నిధులు దర్శనమివ్వడం ప్రపంచంలోనే అరుదైన విశేషంగా భావించబడుతోంది.


ఉప ఆలయాలుఆధ్యాత్మిక సంపద


ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ పుండరీకవల్లి అమ్మవారు, సుదర్శన చక్రత్తాళ్వార్ సన్నిధి, భగవద్రామానుజాచార్యులు, తిరుమలనంబి, అనంతాళ్వారుల సన్నిధులు భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. వైష్ణవ సంప్రదాయానికి ప్రతీకలుగా ఈ దివ్య సన్నిధులు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.


మండపాల శిల్ప సౌందర్యం


ధ్వజారోహణ మండపం, మహామండపం, అర్ధమంటపం, అంతరాలయ మండపం, గర్భాలయ మండపం, బుగ్గ మండపాలు, రాములవారి మండపం, వాహన మండపం, ఉత్సవ మండపాలు అద్భుత శిల్ప సంపదతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.


ఉత్సవాల వైభవం


భగవద్రామానుజాచార్యుల ఆదేశాల మేరకు తిరుమల తరహాలో శ్రీ గోవిందరాజ స్వామివారికి నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, మాఘమాసంలో తెప్పోత్సవాలు, చైత్రమాసంలో వసంతోత్సవాలు, అశ్వయుజమాసంలో పవిత్రోత్సవాలు, జ్యేష్ఠాభిషేకం, పుష్పయాగం, పొన్నకాల్వ ఉత్సవం విశేషంగా జరుగుతాయి.


ప్రతి పౌర్ణమికి గరుడసేవ, మూలమూర్తికి పూలంగి సేవ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి.


ప్రసాదాల మాధుర్యం


ప్రతిరోజూ భక్తులకు పొంగలి, పులిహోర, పెరుగన్నం, దోసెలను నైవేద్య ప్రసాదాలుగా అందిస్తున్నారు. ప్రత్యేక పర్వదినాల్లో చక్కెర పొంగలి, సీరా, క్షీరాన్నం, బెల్లం దోశ, అప్పం, లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేస్తున్నారు.


జీయర్ వ్యవస్థ వైభవం


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ కైంకర్యాలను పర్యవేక్షించేందుకు ఉత్తర మాడ వీధిలో పెద్ద జీయర్ మఠం, సన్నిధి వీధిలో చిన్న జీయర్ మఠాన్ని భగవద్రామానుజాచార్యులు ఏర్పాటు చేశారు.


పుష్కరిణి ఆధ్యాత్మిక కాంతి


ఆలయానికి ఎదురుగా సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన స్వామివారి పుష్కరిణి ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్ముతోంది. ప్రతిరోజూ టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించే భక్తి, ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను ఆహ్లాదపరుస్తున్నాయి.


ప్రతి ఏడాది నిర్వహించే ఏడు రోజుల తెప్పోత్సవాలు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంటాయి. పుష్కరిణిలో అలంకరించిన తెప్పపై స్వామివారి విహారం దర్శించుకోవడం భక్తులకు అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది.


రామాయణం, మహాభారతం, భాగవత ఘట్టాలతో, శిల్పకళా సంపదతో, వైష్ణవ సంప్రదాయ మహిమతో వెలసిన ఈ మహాక్షేత్రం తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది.


Sri Govindaraja Swamy Vari Temple Stands Tall in the Heart of Temple City













Traditionally consecrated in 1130 AD by the great Sri Vaishnava saint Sri Ramanujacharya, Sri Govindaraja Swamy temple is not only regarded as the oldest one but also stands as the tallest shrine,  located in the Heart of the temple city of Tirupati.


Distinguished by its imposing multi-tiered gopuram, with elevan Kalasams, the temple houses Sri Maha Vishnu as Sri Govindaraja Swamy lying with majesty in the reclining posture.


Mythological importance:


It was strongly believed by devotees that Sri Govindaraja Swamy is widely revered as the elder brother of Sri Venkateswara. 


It is Sri Govindaraja Swamy who acted as the caretaker of the vast wealth borrowed from the Lord of Wealth Sri Kubera to fund the celestial marriage of Sri Venkateswara and Sri Padmavathi Devi.  


Devotees also believe an interesting story that is deeply intertwined with the significance of the temple. By measuring the abundant wealth, Sri Govindaraja Swamy became tiresome and rested on Adisesha -the divine serpent king and hence the posture of the presiding deity appears here in the reclining form.


Sacred sub-shrines:


The temple houses several sub shrines dedicated to Sri Partha Sarathi Swamy, Sri Kalyana Venkateswara Swamy, Sri Choodikudutha Nachiyar (SriAndal), Sri Salai Nachiyar Ammavari Temple(Sri Pundarikavalli Temple), Sri Bhasyakarla vari Temple, Sri Anajaneya swamy, Sri Thirumangai Alwar, Sri Kurath Alwar, Sri Madhurakavi, Ananta Alwar, Sri Chakrathalwar, Sri Mudal Alwar, Sri Manavala Mahamuni, Sri Vedantha Desikar, Sri Nammalwar, Sri Sanjeevaraya swamy, Sri Tirumala Nambi Sannidhi, Sri Lakshmi Narayana Swamy temples.


Historical significance:


The temple tank, spread in over 2.5acres and radiates immense spiritual serenity. The divine waters attracts scores of devotees during the seven day annual Teppotsavams.


Festivals:


Akin to Tirumala, this temple also observes several festivals throughout the year.


The following are the important festivals that are being conducted in Sri Govindaraja Swamy Temple with religious fervour.


a) Vaisakha Festival (Annual Brahmotsavam )

b) Float Festival

c) Adhyanotsavam

d) Thiruvadipuram

e) Godaparinayam

f) Sri Salai Nachiyar Panguni Uttiram Festival

g) Radhasapthami

h) Jyestabhishekam

i) Anivara Asthanam

j) Neeratotsavam

k) Buggotsavam

l) Pavithrosthavam

m) Pushpayagam ( Introduced in 2014 )


In addition to the above, Parveta Utsavam and Ponna Kalva utsavams are also being conducted every year. 


Further, Pournami Garudaseva is conducted on the Full moon day of every month.


Besides this, each Alwar Sathumorai and Thirunakshatram are conducted for 10 days in each of the 12 Alwar Temples in a big way.


Golden Gopuram:


The golden vimana Gopuram adds divine splendour to the sacred shrine. Similarly, the temple Dhwajasthambham was also reconsecrated.


Annaprasadam:


Every day Annaprasadam is offered to over 3000 devotees and the Annaprasadam was also introduced in the evenings from February 2026 onwards.


Glorious History:


This temple which has a glorious history of over one thousand years was built by the Chola kings in 10th century A.D. This temple was well developed by various kings especially by Sri Krishna Deva Raya in 15h century.


The symbols, images, sculptures and raja mudrikas of Vijaya Nagara dynasty can be seen on the rocky walls of the outer mandapams, which speaks about the versatility of this ancient temple that is standing 'Tall' at the centre of the temple city majestically.

Unprecedented Rush inTirumala







In view of the summer vacation rush, the number of devotees arriving at Tirumala for the darshan of Sri Venkateswara has been increasing day by day. 


In the last five days, a sea of humanity witnessed in Tirumala and is expected to continue for the next few weeks.


TTD has made extensive arrangements for the convenience of devotees.


Special sheds have been erected around the Srivari Temple surroundings, Laddu counters, and other high-footfall areas. Further, synthetic enamel cool paint has been applied on the four Mada Streets to protect devotees from ground heat. Temporary toilets have also been arranged along the queue lines from Batagangamma Temple Circle to Outer Ring Road.


Hundreds of Srivari Sevaks are continuously distributing drinking water and Annaprasadams to devotees waiting in outside serpentine queue lines in round the clock shifts.  


Similarly, under the supervision of the TTD Health Department, mobile water drums are being used in crowded areas to provide drinking water to devotees waiting in outside lines through Srivari Sevaks.


In accordance with the crowd situation, a mobile first-aid center has also been kept available along the queue lines on the Outer Ring Road.


As accommodation facilities in Tirumala are limited, TTD can allot accommodation only to around 60,000 devotees at a time.  9,000 lockers are available in PAC-1, PAC-2, PAC-3, PAC (Padmanabha Nilayam), and PAC-5. All these facilities are presently fully occupied with over crowd.


TTD has also made elaborate arrangements for devotees offering tonsure to the Sri Venkateshwara. Along with the main Kalyanakatta, 11 mini Kalyanakattas are functioning for devotees 24×7.


In the last five days alone, 4,32,213 devotees had darshan of Lord Venkateswara. More than 90,000 devotees visited the temple on May 16 and 17. Likewise, the number of devotees offering tonsure also increased significantly. More than 43,000 devotees offered hair on May 18, 19, and 20. 


During the last five days, nearly 19 lakh devotees were served Annaprasadams, tea, coffee, milk, and buttermilk at various locations in Tirumala.


Devotee Rush Statistics for the Last Five Days : 


May 20


Darshan - 86,315.

Tonsures - 44,107

Anna prasadam served - 3,99,380


May 19


Darshan - 84,412

Tonsures - 43,032

Anna prasadam served - 4,03,810


May 18


Darshan - 80,455

Tonsures - 43,309

Anna prasadam served - 3,42,670


May 17


Darshan - 91,020

Tonsures - 35,193

Anna prasadam served - 3,81,210


May 16


Darshan - 90,011

Tonsures - 39,083

Anna prasadam served - 4,20,085


Keeping in view the severe summer conditions, the entire TTD machinery is making dedicated efforts to provide essential facilities such as shade, cool atmosphere, drinking water, Annaprasadams, cleanliness, accommodation, tonsure services, and laddus for devotees.


Meanwhile, officials and staff from various departments are continuously monitoring the darshan queue lines, Narayanagiri sheds, and compartments in Vaikuntham Queue Complex round the clock to ensure that devotees do not face any inconvenience.