23.5.26

రుచికర అటుకులపిండి హల్వా |Grandma's Style Traditional PohaFlour Halwa| https://youtu.be/cOjjvoF9gaY


రుచికర అటుకులపిండి హల్వా |Grandma's Style Traditional PohaFlour Halwa|

https://youtu.be/cOjjvoF9gaY

టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ttd addl eo




వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినప్పటికీ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అత్యంత సమర్థవంతంగా దర్శన ఏర్పాట్లు చేస్తోందని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్ చౌదరి తెలిపారు.


శుక్రవారం ఉదయం ఆయన శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి టైమ్ మేనేజ్మెంట్‌, క్యూలైన్ల నిర్వహణ, నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించడంతో దర్శనాల సంఖ్యలో గణనీయమైన వృద్ధి సాధ్యమైందన్నారు.


ప్రతిరోజూ సాధారణ దర్శనాలతో పాటు అదనంగా 15 వేల మందికి పైగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామని వెల్లడించారు. ముఖ్యంగా శ్రీవారి అభిషేక సేవ సమయంలోనూ ఐదు వేల మంది సర్వదర్శన భక్తులకు దర్శనం కల్పించడం ద్వారా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.


సాధారణంగా గురువారం నాడు శ్రీవారికి నిర్వహించే వారపు కైంకర్యాల కారణంగా దర్శన సమయం తక్కువగా ఉన్నా కూడా తొలిసారి రికార్డు స్థాయిలో 79 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించడం టీటీడీ సామర్థ్యానికి నిదర్శనమన్నారు. ప్రతి గంటకు క్యూలైన్ల పరిస్థితిని ఉన్నతాధికారులు సమీక్షిస్తూ, అవసరమైన నిర్ణయాలను తక్షణమే అమలు చేయడం వల్ల దర్శన ప్రక్రియ మరింత వేగవంతమైందన్నారు.


వేసవి రద్దీ నిర్వహణలో టీటీడీ విభాగాలతో పాటు విజిలెన్స్‌, పోలీసు శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయడం విశేష ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, వైద్య సేవలు, క్యూలైన్లలో సౌకర్యాలు నిరంతరాయంగా అందించేలా అన్ని విభాగాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని చెప్పారు.


సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన దర్శనం కల్పించడమే టీటీడీ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం అధికార యంత్రాంగం అంకితభావంతో సేవలందిస్తోందని అదనపు ఈవో తెలియజేశారు.

Devotee Donates Rs 10 Lakhs to TTD




A devotee from Bengaluru Sri Tarun Gowda, donated Rs.10,10,001 to the TTD Sri Venkateswara Vidyadana Trust on Friday.


The donation DD was handed over to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.

Sri Govindaraja Swamy Vari Temple Decoration














 

Grand Ankurarpanam Marks Beginning of Sri Govindaraja Swamy Vari Temple Brahmotsavams






The grand Ankurarpanam ceremony for the annual nine-day Brahmotsavams of Sri Govindaraja Swamy Temple was held ceremoniously on Friday evening amidst Vedic chants, mangala vadyams and sacred rituals, creating a spiritually vibrant atmosphere for devotees.


The Brahmotsavams will formally commence with Dwajarohanam on May 23 between 7.35 am and 8.49 am in Mithuna Lagnam. Special rituals including Tirumanjanam, pujas and flag hoisting will be performed at the Dwajasthambam.


TTD has made elaborate arrangements for the festivities with decorative lighting, floral arrangements, rangolis, paintings, summer shelters and beautification works across the temple surroundings.


Daily Vahana Sevas will be conducted from 7 am to 9 am and 7 pm to 9 pm. Garuda Vahanam on May 27 and Rathotsavam on May 30 will be the major highlights of the Brahmotsavams.


Cultural, devotional and spiritual programmes will also be organised daily under the auspices of TTD Hindu Dharma Prachara Parishad, Annamacharya Project and Dasa Sahitya Project.


Several temple officials, archakas and religious heads participated in the ceremony.

వేదఘోషల నడుమ వైభవంగా గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ brahmotsavams







తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆల వేదఘోషలు, మంగళవాయిద్యాలు, వైదిక మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన పవిత్ర కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది.


ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన సేవలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సేనాధిపతి త్సవం, ముఖ మండపంలో వేంచేపు, సమర్పణ, ఆస్థానం తదితర వైదిక కార్యక్రమాలను వైభవంగా చేపట్టారు. యాగశాలలో ప్రత్యేక పూజల అనంతరం అంకురార్పణం శాస్త్రోక్తంగా నిర్వహించారు.


బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు


శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. వేసవి నేపథ్యంలో చలువ పందిళ్లు, వైట్ పెయింట్, ఆలయం పరిసరాలలో ఆకట్టుకునేలా రంగోలీలు, విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్స్, పుష్పలంకరణలు తదితర ఏర్పాట్లు చేపట్టారు.


మే 23 ధ్వజారోహణం


బ్రహ్మోత్సవాల తొలి రోజు అయిన మే 23 ఉదయం 07.35 గంటల నుండి 08.49 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతం, ఆలయ శుద్ధి, తోమాల సేవ, అర్చన సేవల అనంతరం ధ్వజస్తంభానికి తిరుమంజనం, పూజలు, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగనున్నాయి.


తదుపరి ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం, శుద్ధి, సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు తిరువీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు.


ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు నిర్వహించనున్న వాహనసేవలు భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించనున్నాయి. ముఖ్యంగా మే 27 గరుడవాహన సేవ, మే 30 రథోత్సవం బ్రహ్మోత్సవాల ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.


వాహనసేవల వివరాలు

24.05.2026 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం

25.05.2026 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం

26.05.2026 – ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం

27.05.2026 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి రుడ వాహనం

28.05.2026 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం

29.05.2026 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం

30.05.2026 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం

31.05.2026 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం


బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత, ఆధ్యాత్మి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయరావు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stringent Measures for Devotees Crowd Management in Tiruamala - TTD Addl EO








The TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary, along with Tirupati District SP Sri Subbarayudu conducted joint inspections of queue lines, traffic management, and devotee amenities in Tirumala on Friday evening in view of the heavy summer rush.


The officials personally interacted with devotees and reviewed facilities including Annaprasadam distribution, milk, buttermilk, and drinking water arrangements in the queue lines.


Speaking on the occasion, the Additional EO said TTD is continuously monitoring the crowd situation and taking all necessary measures in coordination with the district administration, police, vigilance, and other departments round the clock.


He stated that special care is being taken to ensure smooth movement of devotees without stampedes, with additional attention towards children and senior citizens. 


Despite unprecedented turn out of vehicles arriving in Tirumala on Friday, traffic is being effectively regulated, he added.


TTD is operating over 320 free bus services, while the APSRTC is running more than 100 additional trips for devotees. 


Around four lakh Annaprasadam servings are being prepared daily, along with distribution of nearly 45,000 litres of buttermilk and 50,000 litres of milk every day.


The Additional EO further said mobile teams and communication systems have strengthened with the coordination among the departments, while additional Srivari Sevaks have been deployed for better devotee assistance. 


Spiritual programmes including Annamacharya Keerthanas and Srivari devotional content are also being continuously played in queue lines.


Devotees were urged not to believe in false propaganda and to immediately contact the toll-free helpline in case of any issues. 


Ambulance, medical, and footpath services are functioning continuously, he added.


District SP Sri Subbarayudu said special security arrangements are in place since the beginning of May in view of the heavy influx of pilgrims. Additional police personnel have been deployed at railway stations, bus stands, Alipiri, Srivari Mettu, Srinivasam, and Vishnunivasam complexes.


He stated that despite around 16,000 vehicles moving daily, traffic is being managed efficiently through coordinated efforts of police, TTD vigilance, and revenue departments. 


Several TTD and police officials participated in the inspections.