బ్రహ్మోత్సవాలకు ముందు శాస్త్రోక్తంగా జూన్ 5న సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించి అనంతరం అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5.30 గం.లకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, అనంతరం తోమాల, కొలువు, మహాలక్ష్మి అమ్మవారికి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి అభిషేకం నిర్వహించారు.
చరిత్రకుచిరునామా – భక్తికినిలయమైనఆలయం
సుమారు 5.15 ఎకరాల విస్తీర్ణంలో అద్భుత శిల్పకళా వైభవంతో నిర్మితమైన ఈ ఆలయం భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆసియాలోనే అతిపెద్దదిగా పేరుగాంచిన 16 ఎకరాల స్కంద పుష్కరిణి ఈ క్షేత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ.
చోళుల కాలం నాటికే ఈ ఆలయం ఉనికిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. సుమారు 400 ఏళ్ల క్రితం కార్వేటినగర రాజవంశీయుడు వెంకటపెరుమాళ్ రాజు ఆలయాన్ని పునర్నిర్మించారు. వేణువు ధరించి, పాదాల వద్ద వెన్నకుండతో, వెనుక గోవుతో, ఇరువైపులా రుక్మిణి, సత్యభామ అమ్మవార్లతో దర్శనమిచ్చే స్వామివారి దివ్య మూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఏకశిలాశిల్పకళకుఅద్భుతనిదర్శనం
ఆలయ ప్రాంగణంలోని శ్రీకోదండరామస్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలు విశేష ప్రాధాన్యం కలిగినవి. శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు తోరణంతో సహా ఏకశిలలో చెక్కబడటం ఈ క్షేత్ర వైభవాన్ని మరింత గొప్పగా నిలబెడుతోంది.
సారంగపాణికీర్తనలతోప్రసిద్ధిపొందినక్షేత్రం
ప్రఖ్యాత వాగ్గేయకారుడు శ్రీ సారంగపాణి ఈ క్షేత్రాధిదేవుడైన శ్రీ వేణుగోపాలస్వామిపై 200కు పైగా భక్తి కీర్తనలు రచించడం విశేషం. 1936 నుండి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయం 1989 ఏప్రిల్ 10న టీటీడీలో విలీనమైంది. అప్పటి నుండి టీటీడీ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తోంది.
నిత్యకైంకర్యాల్లోవిశిష్టనైవేద్యాలు
ప్రతిరోజూ నవనీతం, పెరుగన్నం, కట్టె పొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, పాలు, డ్రైఫ్రూట్స్, పండ్లు తదితర ప్రత్యేక నైవేద్యాలను స్వామివారికి సమర్పించి భక్తులకు ప్రసాదంగా అందజేస్తున్నారు. పర్వదినాల్లో క్షీరాన్నం, బెల్లం పొంగలి, అప్పం, లడ్డూ, వడ, సుగిలు, బెల్లం దోస వంటి విశేష నైవేద్యాలు సమర్పిస్తారు.
ఉత్సవాలవైభవంభక్తులనుఅలరిస్తుంది
ప్రతి శుక్రవారం మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో గృహస్తులు రూ.700 చెల్లించి స్వామి-అమ్మవార్ల కళ్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించారు. తెప్పోత్సవాలు, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, శ్రీరామనవమి, గోకులాష్టమి, పశువుల పండుగ వంటి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత.
భక్తులకుఉచితఅన్నప్రసాదాలు
ప్రతిరోజూ స్వామివారిని దర్శించుకునే భక్తులకు దాతల సహకారంతో మధ్యాహ్నం రుచికరమైన ఉచిత అన్నప్రసాదాలను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేస్తున్నారు.
1989 ఏప్రిల్ 10నటీటీడీలోవిలీనం
శ్రీ రుక్మిణీ–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం కార్వేటినగర రాజుల పాలన అనంతరం 1936 నుండి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అనంతరం 1989 ఏప్రిల్ 10న ఈ ఆలయం టీటీడీలో విలీనం అయింది. టీటీడీ ఆధ్వర్యంలోకి వచ్చిన తరువాత ఆలయ అభివృద్ధికి విశేష ప్రాధాన్యం లభించగా, వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు తదితర ఉత్సవాలు శాస్త్రోక్తంగా, వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, నిత్యకైంకర్యాలు, ఆర్జిత సేవలను క్రమబద్ధంగా నిర్వహించడం ద్వారా ఈ దివ్యక్షేత్రం మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.
Sri M. Ravichandra EO TTD, stated that yoga practice is highly beneficial for mental peace, physical fitness, and a healthy lifestyle. On Friday, he reviewed the arrangements for the programs to be conducted on the occasion of International Yoga Day on June 21, along with concerned officials at the Sudharma meeting hall in Sri Padmavathi Guest House, Tirumala.
Speaking on the occasion, the Executive Officer said that yoga awareness and special training programs should be conducted daily under the aegis of TTD from June 7 to 21. He noted that yoga helps in reducing stress and anxiety and contributes to overall personality development. He emphasized that yoga is an excellent practice for people of all age groups to adopt a healthy lifestyle.
He directed the officials to make elaborate arrangements for the successful conduct of International Yoga Day in coordination with Isha Foundation, Patanjali Yogpeeth, Ramachandra Mission, Brahma Kumaris, and TTD SV Ayurvedic Hospital.
He further instructed that special yoga training programs should be organized from June 7 to 21 for TTD employees, women employees, students, youth, senior citizens, and patients in hospitals. He emphasized that these initiatives should not be limited to Yoga Day alone but should be continued as an ongoing process. He also suggested organizing special programs in educational institutions to create awareness and interest in yoga among students from a young age.
He directed that all necessary arrangements be made for the grand celebration of International Yoga Day on June 21 at 6:00 AM at the Parade Grounds of the TTD Administrative Building in Tirupati. He also suggested organizing a large-scale yoga awareness rally with thousands of participants after the event.
Additional EO Sri C.H. Venkayya Chowdary, JEO (Education & Health) Dr. Sharath, CVSO Sri Muralikrishna, CE Sri Satyanarayana, DFO Sri Phanikumar Naidu, Welfare Deputy EO Sri Anandaraju, and other officials participated in the meeting.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, జూన్ 7 నుండి 21వ తేదీ వరకు ప్రతిరోజూ టీటీడీ ఆధ్వర్యంలో యోగా అవగాహన, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. యోగాభ్యాసం ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. అన్ని వయస్సుల వారిలో ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చేందుకు యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈషా ఫౌండేషన్, పతంజలి యోగపీఠం, రామచంద్ర మిషన్, బ్రహ్మకుమారీస్, టీటీడీ ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జూన్ 7 నుండి 21 వరకు టీటీడీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, విద్యార్థులు, యువత, వృద్ధులు, ఆసుపత్రుల్లోని రోగులకు ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యోగా దినోత్సవానికే పరిమితం కాకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే యోగాపై ఆసక్తి, అవగాహన పెంపొందేలా విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
జూన్ 21న ఉదయం 6 గంటలకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమం అనంతరం వేలాది మంది పాల్గొనే యోగా అవగాహన ర్యాలీ నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో (విద్య, ఆరోగ్యం) డా. శరత్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, సీఈ శ్రీ సత్యనారాయణ, డీఎఫ్‌వో శ్రీ ఫణికుమార్ నాయుడు, సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.