16.6.26

ఏప్రిల్, మే నెల‌ల్లో రికార్డు స్థాయిలో టీటీడీ భక్తుల ల‌గేజీ డెలివరీ సేవ‌లు luggage









శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు టీటీడీ విస్తృత స్థాయిలో గేజీ డిపాజిట్ మరియు డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తోంది.


భక్తులు శ్రీవారి దర్శనం, కాలినడక యాత్ర సమయంలో తమతో తీసుకువచ్చే లగేజీ, బ్యాగులు, సెల్ ఫోన్లను భద్రంగా ఉంచుకునేందుకు తిరుమలలో మరియు కాలినడక మార్గాల్లో కలిపి మొత్తం 65 కౌంటర్లు ఏర్పాటు చేసి 345 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరంగా సేవలందిస్తున్నారు.


టీటీడీ కల్పించిన సేవలను భక్తులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. నేప‌థ్యంలో ఏడాది ప్రిల్, మే నెల‌ల్లో రికార్డు స్థాయిలో 51,38,976 మంది భ‌క్తులు త‌ ల‌గేజీని డిపాజిట్ చేసుకున్నారు. గ‌త ఏడాది ఏప్రిల్ లో 20,75,481 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని భ‌ద్రప‌ర‌చుకోగా, ఏడాది ఏప్రిల్ నెల‌లో 23,15,279 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని భ‌ద్ర‌త ప‌ర‌చుకున్నారు. గ‌త ఏడాది మే నెల‌లో 23,82,622 త‌మ ల‌గేజీని భ‌ద్ర‌ప‌ర‌చుకోగా, ఏడాది 28,23,697 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని భ‌ద్ర‌ప‌ర‌చుకున్నారు


అంటే గ‌త ఏడాది ఏప్రిల్ నెల‌తో పోల్చితే 2,39,798 ల‌గేజీ డిపాజిట్లు, మే నెల‌తో పోల్చితే 4,41,075 ల‌గేజీ డిపాజిట్లు అత్య‌ధికంగా న‌మోదు కావ‌డం విశేషం.


అదేవిధంగా తిరుమలలో రద్దీ పెరిగిన నేపథ్యంలో గత మూడు రోజుల్లో 3,41,742 మంది ఉచిత లగేజీ సేవలు వినియోగించుకున్నారు.


కాలినడక భక్తులకు ప్రత్యేక డిపాజిట్ సౌకర్యం:


అలిపిరి మరియు శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.


అలిపిరి కాలినడక మార్గం ల‌గేజీ కేంద్రం వివ‌రాలు


•  ‍5 కౌంటర్లు.

•  45 మంది సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 15 మంది).

•  10,194 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం.


శ్రీవారి మెట్టు ల‌గేజీ కేంద్ర వివ‌రాలు


•  2 కౌంటర్లు.

•  10 మంది సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 5 మంది).

•  3,025 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం.


కేంద్రాల్లో లగేజీ డిపాజిట్ చేసిన భక్తులు తిరుమలలోని డెలివరీ కేంద్రాల్లో సులభంగా తిరిగి పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది.


తిరుమలలో ప్రధాన డిపాజిట్ కేంద్రాలు


తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో క్తుల కోసం లగేజీ మరియు సెల్ ఫోన్ డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉంది.


•  ఫ్రీ హాల్ – 8 కౌంటర్లు, 20 సిబ్బంది (17,291 సెల్ ఫోన్లు, 7,793 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం).


•  వైకుంఠం క్యూకాంప్లెక్స్– 2 కౌంటర్లు, 12 సిబ్బంది (4,270 సెల్ ఫోన్లు).

•  నారాయణగిరి షెడ్ – 5 కౌంటర్లు, 45 సిబ్బంది (11,941 సెల్ ఫోన్లు, 6,749 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం).

•  డీడీ హాల్ – 3 కౌంటర్లు, 18 సిబ్బంది (2,526 సెల్ ఫోన్లు, 324 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం).

•  రూ.300 హాల్ – 4 కౌంటర్లు, 36 సిబ్బంది (6,338 సెల్ ఫోన్లు, 1,600 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం).

•  వైకుంఠం క్యూకాంప్లెక్స్ అప్ స్కానింగ్ (కంపార్ట్‌మెంట్-03) – 2 కౌంటర్లు, 12 సిబ్బంది.


కల్యాణకట్ట సమీపంలో ప్రత్యేక డిపాజిట్డెలివరీ కేంద్రాలు


తలనీలాలు సమర్పించే భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట సమీపంలో కూడా ప్రత్యేక కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.


KKC 1, 2, 3 – 3 కౌంటర్లు, 18 సిబ్బంది (షిఫ్ట్-06) (688 సెల్ ఫోన్లు, 820 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం).


సుపథం కౌంటర్ – 1 కౌంటర్, 6 సిబ్బంది (షిఫ్ట్-02) (1,286 సెల్ ఫోన్లు, 245 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం).


సీనియర్ సిటిజన్ / దివ్యాంగులు (PHC) – 1 కౌంటర్, 2 సిబ్బంది (265 సెల్ ఫోన్లు, 75 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం)


VQC-1 మెయిన్ గేట్ (శ్రీవాణి ట్రస్ట్) – 1 కౌంటర్, 6 సిబ్బంది (షిఫ్ట్-02)


తిరుమలలో లగేజీ డెలివరీ కేంద్రాలు


డిపాజిట్ చేసిన లగేజీని తిరిగి పొందేందుకు క్రింది డెలివరీ కేంద్రాలు పనిచేస్తున్నాయి:


అలిపిరి ఫుట్‌పాత్ డెలివరీ (జీఎన్సీ వ‌ద్ద‌) – 5 కౌంటర్లు,  45 సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 15 మంది), 9,345 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం.

జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం jyestabhishekam




జూన్ 26 నుండి 28వ‌ తేదీ వరకు తిరుమల‌లోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది.


ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.


సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే క్రతువునుఅభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.


మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల‌ కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు.


బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు.


ఆర్జిత సేవ‌లు ర‌ద్దు


కాగా జ్యేష్టాభిషేకాన్ని పుర‌స్క‌రించుకుని జూన్ 28 తేదిన కళ్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జి బ్ర‌హ్మోత్స‌వ సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.


TTD SIGNS FIRST OF ITS KIND MoU WITH CFTRI IN THE PRESENCE OF UNION MINISTER FOR CONSUMER AFFAIRS


With a noble aim to ensure that all food and sacred prasadams of Srivaru, prepared and distributed by TTD adhere to the highest standards of safety, nutrition and quality, while preserving their traditional character TTD has signed an MoU with the CSIR–Central Food Technological Research Institute (CSIR-CFTRI), Mysore, to integrate scientific methods into TTD’s food systems.


The MoU was first of its kind in the temple sector in the entire country to be entered in the presence Union Minister for Consumer Affairs, Food & Public Distribution, Shri Pralhad Joshi during the two-day RISE Conclave 2026 (Research, Innovation, Start-ups and Entrepreneurship) held at Bengaluru.


Giving a clarion call to the innovators, entrepreneurs and researchers the Minister emphasized the importance of strengthening research and development, expanding manufacturing capabilities and fostering a culture of innovation using  indigenous technologies.


Key features of the partnership:


Strengthened safety and quality controls: Joint teams will develop and implement rigorous quality-control standards, standard operating procedures and monitoring mechanisms covering procurement, preparation and distribution.


Modernization of systems: CSIR-CFTRI will advise on upgrading storage, testing and procurement processes, recommending scientifically validated technologies and best-practice workflows to minimize contamination risk and improve consistency.


Preservation of Prasadam: Research-led packaging and shelf-life interventions will be developed to extend stability without compromising authentic taste, texture or cultural value.


Capacity building: CSIR-CFTRI will provide structured training for TTD’s in-house food analysts and handlers in advanced analytical techniques, sampling protocols, contaminant detection and specialized assessments such as ghee purity and aroma profiling.


Expert engagement: Senior scientists from CSIR-CFTRI will conduct regular visits to TTD facilities to support implementation, validation studies and improvements to storage and procurement planning.

Grand Pushpa Yagam Performed at Sri Venugopala Swamy Vari Temple-Karvetinagaram



The Pushpayagam of Sri Venugopalaswamy along with Sri Rukmini and Satyabhama was performed with great religious fervour at Karvetinagaram on Monday.


The festivities began with Snapana Tirumanjanam to the Utsava deities. Later, Pushpayagam was conducted amid Vedic chants and mangala vadyams using ten varieties of flowers and three types of sacred leaves.


Temple priests said the ritual is performed as an expiatory ceremony for any inadvertent lapses during Brahmotsavams and daily rituals, and is believed to bestow welfare and prosperity upon devotees.


Temple officials, priests and a large number of devotees participated in the event.

పుష్పసుగంధాల మధ్య వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామివారి పుష్పయాగ మహోత్సవంPUSHPAYAGAM



కార్వేటినగరం శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో సోమవారం నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా, భక్తి శ్రద్ధల నడుమ జరిగింది. పుష్పాల పరిమళాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, భక్తులు స్వామివారి దివ్యానుగ్రహాన్ని ఆస్వాదించారు.


సందర్భంగా ఉదయం శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేసి విశేషంగా పూజలు మర్పించారు.


అనంతరం వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ తులసి, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరం, రోజా, తామర, కలువ, మొగలిరేకులు తదితర పది రకాల పుష్పాలు, మూడు రకా పవిత్ర పత్రాలతో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. పుష్పాల అలంకారంతో శోభాయమానంగా దర్శనమిచ్చిన ఉత్సవమూర్తులను దర్శించిన భక్తులు తన్మయత్వం చెందారు.


బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాలలో తెలిసీ తెలియక సంభవించిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని, మహోత్సవం ద్వారా సమస్త దోషాలు నివృత్తి చెంది లోకక్షేమం, భక్తుల శ్రేయస్సు కలుగుతాయని ఆలయ అర్చకులు వివరించారు.

పుష్పయాగం అనంతరం స్వామి, అమ్మవార్లు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు మంగళదర్శనం ప్రసాదించనున్నారు.


కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

TTD Sets New Record in Luggage Deposit and Delivery Services in April, May 2026










Keeping in view the convenience and comfort of multitude of devotees visiting Tirumala, besides safeguarding their belongings, TTD has instituted an extensive, modernised luggage Deposit-and-Delivery system. 


Staff and Counters:


TTD operates 66 dedicated luggage counters across Tirumala and along the footpath routes, staffed by 345 personnel working in three shifts to ensure uninterrupted service. 


These facilities enable pilgrims to safely deposit luggage, bags and mobile phones while undertaking darshan or footpath pilgrimages.


New Record in 2026 Summer :


During April–May 2026, a record 

51,38,976 devotees deposited their  belongings at TTD counters and utilized the services.


Comparative month-wise details are as follows:


April 2025: 20,75,481 deposits; 

April 2026: 23,15,279 deposits (increase of 2,39,798).


May 2025: 23,82,622 deposits; 

May 2026: 28,23,697 deposits (increase of 4, 41,075).


Following heavy crowd witnessed in the last week end, a total of 3,41,742 devotees used the free luggage services in the last three-day period alone.


Special facilities for footpath pilgrims:


Alipiri Footpath Luggage Centre: 5 counters, 45 staff (15 per shift); capacity 10,194 deposits.


Srivari Mettu Luggage Centre: 2 counters, 10 staff (5 per shift); capacity 3,025 deposits.


Deposits made at these centres can be collected at designated delivery points within Tirumala for pilgrims’ convenience.


Deposit centres in Tirumala:


Free Hall: 8 counters, 20 staff; capacity for 17,291 mobile phones and 7,793 luggage deposits.


Vaikuntham Queue Complex: 2 counters, 12 staff; capacity for 4,270 mobile phones.


Narayanagiri Sheds: 5 counters, 45 staff; capacity for 11,941 mobile phones and 6,749 luggage deposits.

DD Hall: 3 counters, 18 staff; capacity for 2,526 mobile phones and 324 luggage deposits.


Rs.300 Hall: 4 counters, 36 staff; capacity for 6,338 mobile phones and 1,600 luggage deposits.


Vaikuntham Queue Complex Up-Scanning (Compartment-03): 2 counters, 12 staff.


Special deposit–delivery facilities near Kalyanakatta:


KKC 1–3: 3 counters, 18 staff; capacity for 688 mobile phones and 820 luggage deposits.

Supatham Counter: 1 counter, 6 staff; capacity for 1,286 mobile phones and 245 luggage deposits.


Senior Citizens / (PHC): 1 counter, 2 staff; capacity for 265 mobile phones and 75 luggage deposits.


VQC-1 Main Gate (Srivani Trust): 1 counter, 6 staff.


Luggage delivery centres in Tirumala:


Alipiri Footpath Delivery Centre (near GNC): 5 counters, 45 staff; capacity for 9,345 deliveries.


Srivari Mettu Delivery Centre (near TBC): 4 counters, 12 staff; capacity for 2,482 deliveries.


PAC Counters 1–4: 8 counters, 24 staff; capacity for 20,477 mobile phones and 7,899 deliveries.

Counter 07: 4 counters, 12 staff.

Counter 08: 4 counters, 12 staff.

Counter 05: 4 counters, 10 staff.


Advanced Technology :


TTD processes facial-recognition-assisted QR code generation. A QR-coded sticker is affixed to the deposited item and a receipt specifying the luggage details is issued to the devotee. 


Presenting the receipt at the collection point enables staff to retrieve and return the item—typically within one minute—using the reference number.


Free Services:


TTD urges all pilgrims to deposit luggage, bags and mobile phones exclusively at official TTD counters and to collect items only upon presentation of the issued receipt/token. 


These services are provided for free in view of the safety and comfort of millions and millions of devotees.