19.6.26

శ్రీ పద్మావతి అమ్మవారి సేవలతో భక్తులకు ఐశ్వర్యం – ఆధ్యాత్మిక ప్రశాంతత.padmavati ammavaru









కలియుగంలో భక్తుల కోరికలను కరుణతో తీర్చే సిరుల తల్లి శ్రీ పద్మావతిఅమ్మవారి అనుగ్రహంతో భక్తులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక ప్రశాంతత కలగాలనిసంకల్పిస్తూ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్యం ఆర్జిత సేవలు అత్యంతవైభవంగా నిర్వహిస్తున్నారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర విధానాల ప్రకారం జరుగుతున్న సేవల్లో దేశవిదేశాల నుండి వేలాదిమంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులవుతున్నారు.


టీటీడీ ఆధ్వర్యంలో నిత్య, వారాంత, నెలవారీ, వార్షిక, శాశ్వత ఆర్జిత సేవలను భక్తిశ్రద్ధలతోనిర్వహిస్తున్నారు. అమ్మవారికి సమర్పించే ప్రతి సేవ భక్తులలో భక్తి భావనను పెంపొందించడంతో పాటుఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తోంది.


నిత్య సేవలు


ప్రతిరోజూ ఉదయం 4.30 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తారు. శుక్రవారం మాత్రం ఉదయం 3.30 గంటలకు ఈ సేవ జరుగుతుంది.


ఉదయం 5 గంటలకు సహస్రనామార్చన నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు ఈ సేవఉంటుంది.


ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.


మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు కుంకుమార్చన సేవ నిర్వహిస్తారు.


సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు సహస్ర దీపాలంకార సేవ జరుగుతుంది.


ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. శుక్రవారం మాత్రం రాత్రి 9.45 గంటలకుఈ సేవ ఉంటుంది.

ఆలయంలోని వేదాశీర్వచన మండపంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకువేదాశీర్వచనం కార్యక్రమం నిర్వహిస్తారు.


ప్రతిరోజూ ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వి.ఐ.పి. బ్రేక్ దర్శనంఉంటుంది.


వారాంతపు సేవలు


ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ నిర్వహిస్తారు.


ప్రతి గురువారం ఉదయం 7 గంటలకు తిరుప్పావడ సేవ జరుగుతుంది.


ప్రతి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అనంతరం అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకు అభిషేకానంతర దర్శనం కల్పిస్తారు.


అదే రోజు ఉదయం 9.30 గంటలకు లక్ష్మీపూజ నిర్వహిస్తారు.


ప్రతి శనివారం ఉదయం 7.30 గంటలకు పుష్పాంజలి సేవ జరుగుతుంది.


నెలవారీ సేవలు


ప్రతి నెల మొదటి బుధవారం ఉదయం 7 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.


వార్షిక సేవలు


ప్రతి ఏడాది మే నెలలో వార్షిక వసంతోత్సవాలు, సెప్టెంబర్ నెలలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.


నవంబర్ నెలలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ రోజున లక్ష కుంకుమార్చన, మరుసటి రోజుపుష్పయాగం వైభవంగా జరుగుతాయి.


ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు.


శాశ్వత సేవలు


శాశ్వత సేవలలో భాగంగా నిత్య అర్చన, ఊంజల్ సేవలను భక్తులు కోరిన రోజున నిర్వహించి ఇద్దరికిదర్శన భాగ్యం కల్పిస్తారు.


అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ శ్రీనివాస స్వామివారిఆలయంలో ప్రతి శనివారం ఉదయం, అలాగే శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతిఆదివారం ఉదయం అభిషేక సేవలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.


ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevesthanams.ap.gov.in లోఆన్‌లైన్ బుకింగ్‌ ద్వారా కూడా సేవా టికెట్లు పొందవచ్చు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయవస్త్రధారణతో, సేవ సమయానికి ముందుగానే ఆలయానికి చేరుకొని టీటీడీ నిబంధనలు పాటించాలనిఅధికారులు సూచించారు.


భక్తులు అమ్మవారి సేవల్లో పాల్గొని దైవానుగ్రహాన్ని పొందాలని కోరడమైనది.

Special Sahasra Kalasabhishekam in Srivari Temple on24th June




The annual Special Sahasra Kalasabhishekam will be observed in Tirumala temple on June 24 in Tirumala temple.


Significance :


In commemoration of the special donation of the silver idol of Sri Bhoga Srinivasa murty by the famous Pallava Queen Samavai Perundevi several centuries ago, TTD performs Special Sahasra Kalasabhishekam to the utsava deities in Ekantham between 6 am to 8 am in the month of Jyesta.


Koutuka Beram:


The Bhoga Srinivasa Murthy is often considered as Koutuka Beram and is also known as Manavala Perumal. 


This deity with four hands, a disc (chakra), and a conch (shankha), is a small 1.5ft tall idol which is believed to be the silver replica of the main deity in all aspects. 


Daily Arjita Sevas as usual:


The daily rituals will follow after the completion of this special Sahara Kalasabhishekam as usual on that day.

కపిలతీర్థంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు : టిటిడి జేఈవో డా. ఎ. శరత్








కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టిటిడి జేఈవో డా. ఎ. శరత్ గురువారం సాయంత్రం ఆలయాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్నందున ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లను మరింత పటిష్టంగా తీర్చిదిద్దడం, డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతులు చేపట్టడం, పరిశుభ్రతను మెరుగుపరచడం వంటి అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి శ్రీ గిరిధర్, డీఈలు శ్రీ రవిశంకర్ రెడ్డి, శ్రీమతి సరస్వతి, ఈఈలు శ్రీ మల్లికార్జున ప్రసాద్, శ్రీమతి సుమతి, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డా. సునీల్ ప్రసాద్, సూపరింటెండెంట్ శ్రీ కె.పి. చంద్రశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

జూన్ 24న శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం sahasra kalasabhishekam




శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై కొన్ని వందల సంవత్సరాల మునుపు ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో జూన్ 24 తేదిన ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వ‌హించ‌నున్నారు.


ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి ఆలయంలోని గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనులవారిని వేంచేపు చేస్తారు.


శ్రీ‌వారి మూల‌మూర్తికి ముందు గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో కౌతుకమూర్తి అయిన‌ శ్రీ మనవాళపెరుమాళ్(శ్రీ భోగ శ్రీనివాసమూర్తి)ను, ఆయన కు అభిముఖంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆశీనులు చేస్తారు. త‌ర్వాత‌ శ్రీ‌వారి మూల‌మూర్తిని శ్రీ భోగ శ్రీ‌నివాస‌మూర్తికి క‌లుపుతూ దారం క‌ట్టి అనుసంధానం చేస్తారు.


అనంత‌రం వేద పండితులు వేద పారాయ‌ణం చేయ‌గా, అర్చకస్వాములు ప్ర‌త్యేక సహస్ర కలశాభిషేకాన్ని వైభ‌వంగా నిర్వహించనున్నారు


కాగా నాడు శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించనున్నారు.

18.6.26

యోగతో శారీరక ఆరోగ్యం – మానసిక ప్రశాంతత : టిటిడి జేఈవో డా. ఎ. శరత్ yoga



ప్రతిరోజూ యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందుతాయని టిటిడి జేఈవో డా. . శరత్ తెలిపారు. "యోగటిటిడి ఆరోగ్యానంద" కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న యోగ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించారు.


సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు టిటిడి ఉద్యోగులకు నెల 7 నుండి 21 తేదీ వరకు 15 రోజుల యోగ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


మనస్ఫూర్తిగా యోగాభ్యాసం చేస్తే ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కుటుంబ జీవితంలో ఆనందం, సౌఖ్యం నెలకొంటాయని చెప్పారు. శిక్షణలో పాల్గొంటున్న ఉద్యోగులు నెల 18, 19, 20 తేదీల్లో జరిగే యోగ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.


కార్యక్రమంలో టిటిడి వెల్ఫేర్ డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరావు, స్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. నారాయణమ్మ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Meeting Held with Dals Millers of AP





With a noble aim to supply high-quality delicacies involving dal in Annaprasadam (the massive free meals programme of Tirumala Tirupati Devasthanams), a meeting was held by the Additional EO Sri Ch Venkaiah Chowdary with Dal millers hailing from different parts of Andhra Pradesh in Tirumala on Thursday.

 
The meeting discussed in detail the Quantitative and Qualitative supply of ingredients (dals) to TTD. The Additional EO said, TTD utilizes Seven varieties of dals in its daily consumption of Annaprasadam seven types of dals including Bengal Gram, Fried Bengal Gram, Black Gram without husk, Black gram with husk, Thoor Dal, Greengram and groundnuts. “In the last couple of years, we have improved the quality of rice by procuring the rice from the Rice Millers Association without any compromise and anticipating similar quality and quantity supply of Dals from Dal Millers of AP also, he asserted.

 

Responding positively, the representatives of AP Dal Millers also said they are willing to associate in the divine service of Annaprasadam activity of TTD- which is serving millions and millions of visiting pilgrims every day, by supplying the qualitative products.


Later the Additional EO instructed the officers concerned to work on the probabilities of procuring the Dals from the Millers in a transparent manner.

 

DyEO Annaprasadam Sri Rajendra Kumar, DyEO Warehousing Smt Padmavathi, GM Procurement Sri Umashankar, AEO Potu Sri Muniratnam, Special Officer Catering Sri Shastry, various Dal millers from AP were also present.

Speed up Construction of Sri Padmavati Children Hospital - TTD JEO




TTD JEO Dr. A. Sharath directed officials to expedite the construction of the new Sri Padmavathi Children’s Hospital in Tirupati and complete the project within the stipulated timeline.


Reviewing the works on Wednesday along with engineering officials, he stressed the need for quality execution, timely completion, and parallel development of medical infrastructure and other facilities. He also announced weekly reviews and site inspections to closely monitor progress and ensure there is no compromise on quality.


Senior engineering, hospital, and forest officials were present.