20.6.26

TTD Makes Elaborate Arrangemnts for Sri Padmavati Ammavari Teppotsavams




TTD has made elaborate arrangements for the annual Sri Padmavathi Ammavari Teppotsavams to be held at Tiruchanoor from June 25 to 29. TTD JEO Dr. A. Sarat reviewed the arrangements on Friday and directed officials to ensure smooth conduct of the festivities and provide all facilities to devotees.


He instructed officials to focus on security, sanitation, drinking water, power supply and darshan arrangements. The fitness of the floats will be thoroughly checked and trial runs conducted. The floats will also be beautifully decorated with flowers and illumination.


Special spiritual and cultural programmes, including devotional music concerts, discourses and bhajans, will be organised during the five-day festival.


The Teppotsavams will feature Sri Krishna Swamy on June 25, Sri Sundararaja Swamy on June 26, and Sri Padmavathi Ammavaru from June 27 to 29. Gaja Vahanam and Garuda Vahanam processions on June 28 and 29 respectively will be major attractions.

తిరుచానూరులో అమ్మవారి తెప్పోత్సవాలకు సర్వాంగ సుందర ఏర్పాట్లు tiruchanoor





తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ 25 నుండి 29వ తేదీ వరకు నిర్వహించనున్న తెప్పోత్సవాల ఏర్పాట్లను టిటిడి జేఈవో డా. ఎ. శరత్ శుక్రవారం అధికారుల‌తో క‌లిసి పరిశీలించారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


ఈ సందర్భంగా టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ శుక్రవారం ఆలయ అధికారులతో కలిసి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, దర్శన సౌకర్యాలు తదితర అంశాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

తెప్పోత్సవాల్లో వినియోగించే తెప్పల ఫిట్‌నెస్‌ను పూర్తిగా పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించాలని జేఈవో సూచించారు. అలాగే విద్యుద్దీపాల కాంతులతో, పుష్పాల అలంకరణలతో తెప్పలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జేఈవో తెలిపారు. ఈ కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచనున్నాయని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని జేఈవో భక్తులను కోరారు.

ఉత్సవాల విశేషాలు
జూన్ 25

రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి తెప్పోత్సవం

జూన్ 26

శ్రీ సుందరరాజస్వామివారి తెప్పోత్సవం

జూన్ 27 నుంచి 29 వరకు

శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం

గజవాహన, గరుడవాహన సేవలు ప్రత్యేక ఆకర్షణ

జూన్ 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవ, జూన్ 29వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడవాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తనుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఎస్‌ఈలు శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ నరసింహమూర్తి, విజివో శ్రీ గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

TTD to Conduct E-Auction of Used Empty Gunnies




Tirumala Tirupati Devasthanams (TTD) will conduct an e-auction for the sale of three varieties of used empty gunnies on a rate contract basis for the period from April 1, 2026 to March 31, 2027.


The e-auction will be held on June 30, 2026 through the Andhra Pradesh Government's Konugolu Portal under Auction ID No. 26083.


Interested bidders are required to pay an Earnest Money Deposit (EMD) of Rs.75,000.


For further details, visit the Konugolu Portal at https://konugolu.ap.gov.in or contact the Office of the General Manager (Auctions), TTD, at Phone: 0877-2264429 or Email: gmauctionsttd@gmail.com.

వాడిన ఖాళీ గోనె సంచుల ఈ-వేలం e auction




టిటిడి ఆలయాలలో  2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు మూడు రకాల వాడిన ఖాళీ గోనె సంచులనురేట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికనవిక్రయించేందుకు -వేలం నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొనుగోలు (Konugolu) పోర్టల్ ద్వారా Auction ID No. 26083 కింద 2026 జూన్ 30 -వేలం జరగనుంది. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.75,000/- ఈఎండీ చెల్లించాలి.


వివరాలకు కొనుగోలు పోర్టల్ https://konugolu.ap.gov.in ను సందర్శించవచ్చు. అలాగే టిటిడి జనరల్ మేనేజర్ (వేలాలు) కార్యాలయాన్ని ఫోన్: 0877-2264429 లేదా -మెయిల్: gmauctionsttd@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.


19.6.26

Better Amenities for Devotees at Kapilatheertham- TTD JEO






TTD JEO Dr. A. Sarath inspected devotee facilities at Sri Kapileswara Swamy Temple, Kapilatheertham, on Thursday evening in view of the increasing pilgrim turnout.

He directed engineering officials to make necessary arrangements for the upcoming rainy season to ensure devotees do not face any inconvenience. He also instructed officials to prepare a comprehensive report on strengthening queue lines, improving drainage, and enhancing cleanliness, and to take up the works on priority.

TTD Deputy EO Smt. B. Nagaratna, Vigilance and Security Officer Sri Giridhar, and other officials were present.

ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో సమావేశం meeting with millers







తిరుమలలో అన్నప్రసాదాల తయారీలో నాణ్యమైన పప్పు దినుసులను వినియోగించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో టీటీడీకి అవసరమైన పప్పు దినుసుల నాణ్యత, పరిమాణం, సరఫరా తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రోజువారీ అన్నప్రసాదాల తయారీలో శనగలు, పొట్టు తీసిన మినుములు, పొట్టుతో కూడిన మినుములు, కందిపప్పు, పెసరపప్పు, వేరుశెనగలు వంటి ఏడు రకాల పప్పు దినుసులను టీటీడీ వినియోగిస్తోందని అదనపు ఈవో తెలిపారు.

గత కొన్నేళ్లుగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల నుంచి కూడా నాణ్యతతో పాటు అవసరమైన పరిమాణంలో పప్పు దినుసులు సరఫరా చేయాలని కోరారు.

దీనికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల ప్రతినిధులు, ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు మహా యజ్ఞంగా అన్నప్రసాదాలు అందిస్తున్న టీటీడీ సేవలో భాగస్వాములై, నాణ్యమైన పప్పు దినుసులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అనంతరం పప్పు మిల్లర్ల నుంచి పప్పు దినుసుల కొనుగోలుకు ఉన్న పారదర్శకమైన విధానాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో ఆదేశించారు.

ఈ సమావేశంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, వేర్‌ హౌసింగ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పద్మావతి, జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) శ్రీ ఉమాశంకర్, పోటు ఏఈవో శ్రీ మునిరత్నం, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు పప్పు మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Grandeur Marks Arjita Seva in Tiruchanoor







Celestial grandeur marks various arjita sevas that are performed in Tiruchanoor, the abode of Goddess of Riches, Sri Padmavathi Devi.


This famous ancient temple located about 5km from the temple city of Tirupati is considered the second most visited pilgrimage centre after Tirumala.


Importance of Sevas and rituals:


Akin to Tirumala temple wherein over 450 festivals are being observed across the year, more than 200 festivals, rituals and poojas, including daily, weekly, monthly, annual as mentioned in sacred texts like Padma Samhita, Naradiya Samhita are being observed strictly in accordance with Pancharatra Agama Vidhi in Tiruchanoor.


All the Arjita Sevas in this famous shrine follows the prescribed tenets of Pancharatra Agama.


Tens of thousands of devotees from across India and abroad are being provided a solemn opportunity to seek the blessings of the Goddess for prosperity, good health and spiritual peace through these Sevas.


Devotees are requested to observe the traditional Dress Code and arrive well in advance of scheduled seva times to complete security and entry formalities. 


Arjita Seva tickets may be booked online at http://ttdevesthanams.ap.gov.in or at temple counters subject to availability.