ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం కల్యాణ వేదికపై ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన, కళాశాల విద్యార్థులు ఆలపించిన సంకీర్తనలు భక్తులను మైమరిపించాయి.
ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు అధ్యాపకులు, విద్యార్థులు ఆలపించిన '' రామరామ రఘురామ పరాత్పర....., పాహి కళ్యాణ రామ పావన గుణ రామ....., ఎక్కడ జూచిన మన శ్రీ రాముడే.....'' తదితర సంకీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
అంతకుముందు మధ్యాహ్నం 3.30 గంటలకు కుప్పంకు చెందిన శ్రీ మూర్తి బృందం మంగళ ధ్వని ఆహుతులను అలరించింది




No comments :
Write comments