ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు శ్రీవారి సేవకులు విశేష సేవలందిస్తున్నారు. సాధారణ రోజులలో కడప, రాజంపేట, ప్రొద్దుటూరు, రాయచోటి నుండి దాదాపు వెయ్యమంది, ఏప్రిల్ 11వ తేదీ శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా ఎండ వేడిని కూడా లెక్కచేయకుండా 2,500 మందికి పైగా శ్రీవారి సేవకులు సేవలందించారు.
ఏప్రిల్ 11వ తేదీ శ్రీసీతారాముల కల్యాణానికి విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు అందజేసేందుకు పిఏసిలో అక్షింతలు, ముత్యం, కంకణం కలిపి ప్యాక్ చేశారు. అదేవిధంగా అన్నప్రసాదాల ప్యాకింగ్ మరియు పంపిణీ, వాటర్ బాటిళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, క్యూలైన్ల క్రమబద్ధీకరణలో శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారు.
ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు స్వామివారిపై ఉన్న భక్తితో ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు బ్రహ్మోత్సవాలలో వివిధ విభాగాలలో సేవలందిస్తున్నారు.













No comments :
Write comments