28.5.25

శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన టిటిడి ఈవో – మే 29న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం




తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 02 నుండి జూన్ 10వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పోస్టర్ ను టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు ఆవిష్కరించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో మంగళవారం ఆయన పోస్టర్ ను ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా టిటిడీ ఈవో మాట్లాడుతూ, వేసవి నేపథ్యంలో శ్రీగోవిందరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు  విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆలయంలో చలువ పందిళ్లు,  వైట్ పెయింట్, ఆకట్టుకునేలా రంగోలీలు, విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్స్, పుష్పలంకరణలు తదితర ఏర్పాట్లు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న వాహనసేవలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

జూన్ 01వ తేదీ సాయంత్రం 5.30 గం.ల నుండి 8.00 గం.ల వరకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 02వ తేదీ ఉదయం 07.02 నుండి 07.20 గం.ల వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణము జరుగనుంది. రాత్రి 07 గం.లకు పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.
03.06. 2025 - ఉ. – చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం
04.06. 2025 - ఉ. - ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపుపందిరి వాహనం
05.06. 2025 - ఉ. – కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనం
06.06. 2025 - ఉ. – మోహినీ అవతారం, రాత్రి – గరుడ వాహనం
07.06. 2025 - ఉ. – హనుమంత వాహనం, రాత్రి – గజ వాహనం
08.06. 2025 - ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం
09.06. 2025 - ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వవాహనం
10.06. 2025 - ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, జీవో శ్రీ ముని కృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. 

No comments :
Write comments