తిరుమలలోని అలిపిరి మెట్లమార్గం మరియు ఘాట్ రోడ్డుల వద్ద ఇటీవల కాలంలో వన్యమృగాలు, ముఖ్యంగా చిరుతపులుల కదలికలు పెరిగిన నేపథ్యంలో మానవ-వన్యప్రాణి ఘర్షణల నివారణ చర్యలపై మంగళవారంనాడు గోకులం సమావేశ మందిరంలో ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం జరిగింది.
టీటీడీ ఈవో శ్రీ జే. శ్యామల రావు (వర్చువల్) అదనపు ఈవో శ్రీ చ. వెంకయ్య చౌదరితో కూడి ఈ సమావేశాన్ని టీటీడీ అటవీ శాఖ, అటవీ శాఖ, వివిధ విభాగాల అధికారులతో నిర్వహించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
• అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రతకు అదనపు సిబ్బంది కేటాయింపు
• ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ ద్వారా చెత్తను తొలగించేందుకు చర్యలు
• టీటీడీ అటవీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడకమార్గంపై నిరంతర జాయింట్ డ్రైవ్ నిర్వహణ.
• మానవ-వన్యప్రాణి ఘర్షణ నివారణకు తక్షణ, దీర్ఘకాలిక చర్యల రూపకల్పనలో Wild Life Institute, అటవీ శాఖల సహకారం.
• అలిపిరి మార్గాన్ని “చిరుత రహిత ప్రాంతంగా” మార్చేందుకు కెమెరా ట్రాపులు, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెసన్సింగులు, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చులు, పెప్పర్ స్ప్రేలు తదితర రక్షణ పరికరాల వినియోగం.
• నిషేధిత ఆహార పదార్థాల అమ్మకంపై దుకాణదారులకు ఆంక్షలు, అవగాహన కల్పించడం.
• అలిపిరి మెట్ల మార్గంలో 2.5 కిలోమీటర్ల పొడవు ఉన్న ఏడవ మైలు నుండి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు పటిష్ట భద్రత కల్పన, నిఘాపై ప్రత్యేక దృష్టి.
• ప్రతి నెల మానవ-వన్యప్రాణి ఘర్షణలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికల పురోగతిని సమీక్షించడం.
ఈ సమావేశంలో వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీనియర్ సైంటిస్ట్ డా. రమేష్ కృష్ణమూర్తి, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ సెల్వం, డి.ఎఫ్.ఓ శ్రీ వివేక్ ఆనంద్, టీటీడీ డీసీఎఫ్ శ్రీ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు శ్రీ సోమన్నారాయణ, శ్రీ వెంకటేశ్వరులు, ఆరోగ్య అధికారి డా. మధుసూదన్, వీజీవో శ్రీ సురేంద్ర, అలిపిరి ఏవీఎస్ఓ శ్రీ రమేష్ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.




No comments :
Write comments