27.5.25

శ్రీవారి మెట్టు మార్గంలో సెక్యూరిటీ పై విమర్శలు త‌గ‌దు




నిన్నటిరోజు టోకెన్ ఉన్న 5000 భక్తులతో పాటు, టోకెన్ లేకుండా సుమారు 7000 మంది భక్తులు శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమల చేరడం వల్ల టోకెన్ సెంటర్ పరిసరాల్లో తీవ్ర వాహన రద్దీ మరియు ఓవర్ క్రౌడింగ్ ఏర్పడింది. క్యూలైన్లు తక్కువగా ఉండటం, అత్యవసర సేవలకు అంతరాయం వంటి సమస్యలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో, అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు క్రౌడ్ కంట్రోల్ చర్యలు మరింత పటిష్టంగా అమలు చేయబడ్డాయి. పంపుహౌష్ వద్ద, ఓల్డ్ మయూరి డెయిరీ ముందు మరియు రైల్వే అండర్ బ్రిడ్జి మొత్తం మూడు కట్-ఆఫ్ పాయింట్లను ఏర్పాటు చేసి, భక్తుల వాహనాలను దశలవారీగా నిలిపి, టోకెన్లకు అనుగుణంగా భక్తులను సెగ్మెంట్లుగా చేసి పంపించడం జరిగింది. అయితే కొంత మంది భక్తుల ను పై మూడు ప్రాంతాలలో అవుతున్న క్రమం లో కొందరు భక్తులు మేము నడచి వెళతాము అని అడుగగా వారిని విజిలెన్స్ సిబ్బంది పంపడం జరిగింది. అయితే కొందరు వ్యక్తులు వాటిని వీడియోలు తీసి విజిలెన్స్ సిబ్బంది అడ్డా దారిలో టోకెన్ కు పంపుతున్నారు అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం .
భక్తుల యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లో భాగంగానే విజిలెన్స్ సిబ్బంది విధులు నిర్వర్తించడం జరిగింది.
అంతే కాకుండా అత్యవసర వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చెయ్యబడ్డాయి. టోకెన్లు పొందిన తర్వాత కూడా భక్తుల రద్దీని తగ్గించేందుకు విజిలెన్స్ మరియు అధికారులు, సిబ్బంది స్వయంగా లగేజీ లారీల్లోకి లోడ్ చేయడం జరిగింది.
ఈరోజు కూడా 5000 టోకెన్లు మంజూరు చేయగా, టోకెన్ లేకుండా మరో ఐదు నుండి ఆరు వేల‌ మంది భక్తులు తిరుమలకు వెళ్లారు. ఓవర్‌క్రౌడింగ్‌ను నివారించేందుకు ముందస్తు ప్రణాళికతో శ్రీవారి మెట్టు టోకెన్ సెంటర్ వద్ద సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు.
అయితే కొంతమంది పనిగట్టుకుని సిబ్బందిని విమర్శించడం భావ్యం కాదని తెలియజేస్తున్నాం .

No comments :
Write comments