తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి శుక్రవారం వేకువజామున దర్శన క్యూలైన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కృష్ణతేజ విశ్రాంతి భవనం వద్ద క్యూలైన్లలో శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, తాగునీటిపై ఆరా తీసి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఆకస్మిక తనిఖీల్లో అదనపు ఈవో వెంట డిప్యూటీ ఈవో (హెల్త్) శ్రీ సోమన్ నారాయణ ఉన్నారు.


No comments :
Write comments