టిటిడి ఈఓ శ్రీ జె. శ్యామలారావు తిరుమలలోని సహజ శిలా తోరణం మరియు చక్ర తీర్థాన్ని గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.
తన తనిఖీలో భాగంగా ఈ ప్రాంతాలలో పార్కింగ్, శుభ్రత, మొదలైన అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం ఆయన చక్ర తీర్థం రాతి కొండలో చెక్కి ఉన్న శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్, నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి ప్రతిమలను మరియు అక్కడే ఉన్న శ్రీ శివుని సాన్నిధ్యాన్ని కూడా పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆ ప్రాంగణంలో పరిశుభ్రత మెరుగుపరచాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆరోగ్య శాఖ డిప్యూటీ ఈఓ శ్రీ సోమన్ నారాయణ, ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూధన్, టిటిడి అటవీ శాఖ సిబ్బంది మరియు ఇతరులు కూడా హాజరయ్యారు.






No comments :
Write comments