11.6.25

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు Kalpavrikhavahanam









అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ రాజమన్నార్ అలంకారంలో స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

ఉదయం 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 - 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 04 - 4.30 గం.ల మధ్య కళ్యాణ మండపానికి శ్రీవారు వేంచేపు చేశారు. సాయంత్రం 4.30 - 6.30 గం.ల మధ్య శ్రీవారి ఆర్జిత కళ్యాణోత్సవం జరుగుతుంది.
మంగళవారం రాత్రి 07.00 గం.లకు సర్వభూపాల వాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
వాహన సేవలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments