తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం ధ్వజావరోహణంతో ముగిశాయి.
సాయంత్రం 8.40 నుండి 9.30 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ ఓ బాలాజీ, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, అర్చకులు, ఏవీఎస్వో శ్రీ మోహన్ రెడ్డి, పలువురు శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments