చిత్తూరు జిల్లా కలిగిరికొండ శ్రీ కలిగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో మండలాభిషేకం సందర్భంగా జూలై 13న ఉదయం 06.00 - 07.30 గం.ల వరకు పుణ్యాహం, పూర్ణాహుతి జరుగనుంది. అటు తర్వాత ఉదయం 07.55 - 08.20 గం.ల వరకు ఉత్సవమూర్తిగా కళావాహనం, స్నపన తిరుమంజనం, అలంకారం చేపడుతారు. ఉదయం 11.00 గం.లకు శాంతి కల్యాణం వైభవంగా జరుగనుంది. ఉత్సవమూర్తులను ముస్తాబు చేసి మేళతాళాల నడుమ కల్యాణ వేదికపైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారు ఆశీనులుకానున్నారు. పండితుల మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయం భక్తిపారవశ్యంతో నిండిపోనుంది. మాంగల్యధారణ, ముత్యాల తలంబ్రాల క్రతువులను భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 05.00 - 06.30 గం.ల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారుగరుడ సేవపై ఊరేగించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.
No comments :
Write comments