21.7.25

జూలై 29న గరుడ పంచమి Garuda Panchami




తిరుమ‌ల‌లో జూలై 29వ తేదీ మంగళవారంనాడు గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించ‌నున్నారు. ఈ నెలలో స్వామివారు రెండో సారి గరుడ వాహనంపై దర్శనమివ్వనున్నారు.


ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.

No comments :
Write comments