30.7.25

వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తానికి జూలై 31న ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ Varalakshmi Vratam tickets




తిరుచానూరులో ఆగ‌స్టు 8వ తేదీ శుక్ర‌వారం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.  


ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్ర‌తాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది.

భ‌క్తులు నేరుగా వ్ర‌తంలో పాల్గొనేందుకు జూలై 31న ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తారు. అదేవిధంగా ఆల‌యం సమీపం కౌంటర్‌లో ఆగ‌స్టు 7న ఉదయం 9 గంటలకు కరెంట్‌ బుకింగ్‌లో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000/- చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజ‌ల సేవ‌, బ్రేక్ ద‌ర్శ‌నం, వేద ఆశీర్వ‌చ‌నం సేవలను టిటిడి రద్దు చేసింది.

No comments :
Write comments