అన్నమయ్య జిల్లా
జూలై 05న ధ్వజారోహణం :
జూలై 05వ తేదీ శనివారం ధ్వజారో హణంతో శ్రీ సౌమ్యనాథస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారం భం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో పలు కైంకర్యాలు ని ర్వహించనున్నారు. ఉదయం 10.30 - 11.00 గం.ల వరకు సింహలగ్నంలో ధ్ వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ ధంగా నిర్వహించనున్నారు. అదేరో జు సాయంత్రం 05 గం.లకు ఊంజల్ సే వ, రాత్రి 07.00 గం.లకు యాళివా హనం, చతుస్థానార్చనము జరుగనున్ నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరో జు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గం టలకు వాహనసేవలలో స్వామివారు వి హరిస్తారు.
ఆలయ చరిత్ర : శ్రీ సౌమ్యనాథ స్ వామివారి ఆలయ నిర్మాణానికి 11వ శతాబ్ధంలో చోళవంశరాజు కుళోత్తుం గ చోళుడు శ్రీకారం చుట్టినట్లు చరిత్ర చెబుతోంది. చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర రాజులచే 17వ శతాబ్దం వరకు ఆలయం నిర్మాణం కొ నసాగి, మట్టిరాజుల కాలంలో ఆలయం ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరు ద్రుడు రాజగోపురం కట్టింటినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్ రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుల జన్మస్థలమైన తాళ్ ళపాక గ్రామం నందలూరుకు దగ్గరలో ఉన్నందున అన్నమాచార్యుల వారు శ్ రీవారిని దర్శించి స్వామివారిపై కీర్తనలు రచించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలో ఎటువంటి దీపం లేకున్ నా స్వామివారు ఉదయం నుండి సాయం కాలం వరకు దేదీప్యమానముగా వెలు గొందే విధముగా ఆలయమును నిర్మిం చడం ఒక అద్భుతం. సంవత్సరంలో ఏదో ఒకరోజు సూర్యకిరణాలు స్వామి వా రి పాదాలపై ప్రసరించే విధముగా శిల్పులు నిర్మించారు.
వాహనసేవల వివరాలు :
తేదీ
05-07-2025
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – యాలి వాహనం
06-07-2025
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హంస వాహనం
07-07-2025
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – సింహ వాహనం
08-07-2025
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హనుమంత వాహనం
09-07-2025
ఉదయం – శేష వాహనం
రాత్రి – గరుడ వాహనం
10-07-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
11-07-2025
ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం ( ఉదయం 10 గంటలకు)
రాత్రి – గజ వాహనం
12-07-2025
ఉదయం – రథోత్సవం (ఉదయం 08 గం టలకు)
రాత్రి – అశ్వవాహనం
13-07-2025
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
జూలై 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చె ల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్ గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీ యం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 14న సాయంత్రం 6 గంటలకు పుష్పయా గం జరుగనుంది.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్ మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజె క్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్ యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృ తిక కార్యక్రమాలను చేపడుతారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెం ట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్ స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్ చకులు తదితరులు పాల్గొన్నారు.




No comments :
Write comments