30.7.25

త‌రిగొండ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆల‌య‌ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌ ankurarpanam




అన్న‌మ‌య్య జిల్లా త‌రిగొండ‌ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణలో భాగంగా చేపట్టిన బాలాలయంకు  మంగ‌ళ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు.


జూలై 30వ తేదీ ఉదయం చతుష్టానార్చన, బింబ, కుంభ, కుండ, ద్వార, తోరణ, అండరాల, పాఠక, దేవతాప్రతిష్ఠలు, సాయంత్రం నిత్యహనన ద్వార పూజలు, ఏకాంతసేవ నిర్వహిస్తారు.

జూలై 31న ఉదయం నిత్యహవనాదులు, ధ్వజస్తంభ అభిషేకం, సాయంత్రం నిత్యహవనాదులు, ఏకాంతసేవ జరుగనున్నాయి.

ఆగ‌స్టు 1వ తేదీన మహాపూర్ణాహుతి, ధ్వజస్తంభ నిర్మూలన, బింబ, కుంభ, ధ్వజస్తంభ ఉద్వాసనలు, మహానివేదన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. 

No comments :
Write comments