16.7.25

శ్రీ క‌లిగిరి వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయానికి పూజా సామ‌గ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానం




చిత్తూరు జిల్లా క‌లిగిరికొండ‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యానికి 2025-26 సంవత్సరానికి గాను పూలు, పాలు, పెరుగు, అర‌టిపండ్లు, త‌మ‌ల‌పాకులు, టెంకాయ‌లు త‌దిత‌ర పూజా సామ‌గ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానించడమైనది.


 ఆసక్తిగల వ్యాపారస్థులు "కార్యనిర్వహణాధికారి, టిటిడి" పేరిట రూ.112 డిడి తీసి సదరు ఆలయంలో దరఖాస్తులు పొందవచ్చు. టెండర్ ఫారంతో ధరావత్తు సొమ్ము (ఈఎండి) రూ.10,000 డిడిని (ఈవో, టిటిడి పేరు మీద) తీసి జతపరచవలెను. టెండర్ దరఖాస్తుల స్వీకరణ ముగింపు 23.07.2025 మధ్యాహ్నం 03.00 గం.లకు,  టెండర్ పరిశీలన అదే రోజు మద్యాహ్నం 04.00 గంటలకు శ్రీనివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయ ప్ర‌త్యేక శ్రేణి  డెప్యూటీ ఈవో కార్యాలయం నుందు జరుగనుంది.  

ఇతర వివరాలకు ఆలయ కార్యాలయం పనివేళలలో ఆల‌య ప్ర‌త్యేక డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని సంప్రదించగలరు.

No comments :
Write comments