సామాన్య భక్తుల
సోమవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యు లతో కలిసి శ్రీవారిని దర్శించు కున్నారు. దర్శనానంతరం ఆయనకు రం గ నాయకుల మండపంలో పండితులు వేదా శీర్వచనం అందించగా, టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలు అం దజేశారు.
అనంతరం ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో స్వామివారి దర్శనానికి ఉండే స్థలం, సమయం పరిమితంగా ఉండటంతో బయట ఎంత మంచి ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తు ల రద్దీ కారణంగా సామాన్య భక్తు లకు ఇబ్బంది కలుగుతుందన్నారు.
ఈ నేపథ్యంలో వీఐపీలు ఏడాదికోసా రి మాత్రమే పరిమిత సంఖ్యలో కుటుం బ సభ్యులను తీసుకువస్తే దేవస్థా నం నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందన్నారు. ప్రజా ప్రతినిధులందరూ భాద్యతతో హుందా గా ఈ సూచనను పాటించాలని తెలి యజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్ డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లో కనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.



No comments :
Write comments