31.7.25

ఆగస్టు నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష పూజలు




ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.


- ఆగస్టు 8న ఉదయం 8 నుండి 10 గంట‌ల వరకు వరలక్ష్మీ వ్రతం

- ఆగస్టు 9న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణం

-  ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం......

-   ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సౌభాగ్యం

-   ఆగస్టు 9న శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి తిరుమంజనం,

-    ఆగస్టు 18, 19, 20 తేదీలలో ఆల‌యంలో బాలాలయం, జీర్ణోద్ధరణ

-  ఆగస్టు 24న పుబ్బ నక్షత్రం సందర్భంగా శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుమంజనం, గ్రామోత్సవం

 -   ఆగస్టు 25న ఉత్తరా నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతీ అమ్మవారికి స్నపన తిరుమంజనం, ప్రాకారోత్సవం

No comments :
Write comments