31.7.25

ఘాట్‌ రోడ్ వాహనాలపై నిర్దిష్టమైన పాల‌సీ డాక్యుమెంట్‌ సిద్ధం చేయాలి అధికారుల‌కు టీటీడీ అద‌న‌పు ఈవో ఆదేశం




తిరుమలలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రాకపోకలను, తద్వారా ఏర్పడుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఘాట్‌ రోడ్లలో వాహనాలు మరియు తిరుమలలో ట్రాఫిక్‌ నియంత్రణపై పాల‌సీ డాక్యుమెంట్‌ సిద్ధం చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి  సంబంధిత అధికారులను ఆదేశించారు.


బుధవారం తిరుమల గోకులం స‌మావేశ మందిరంలో టీటీడీ ట్రాన్స్‌పోర్ట్‌, అటవీ, విజిలెన్స్‌, ఆర్టీఏ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుమలలో ట్రాఫిక్‌ను నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చర్యలపై ఆయ‌న స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ పాల‌సీ డాక్యుమెంట్ లో ఈవీ పాలసీ, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను బలోపేతం చేయడం, ప్రైవేట్‌ జీప్‌ డ్రైవర్లకు అవగాహన కల్పించడం, పాత వాహనాల వల్ల ఏర్పడుతున్న పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ట్రాఫిక్‌ నియమాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలు చేర్చాలని సూచించారు.

అలాగే తిరుమలలో ప్రీపెయిడ్‌ టాక్సీ సదుపాయం ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక పార్కింగ్‌ స్థలం గుర్తించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం కనీస, గరిష్ట ఛార్జీలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ట్రాన్స్‌పోర్ట్‌ జీఎం శ్రీ శేషా రెడ్డి, టీటీడీ డిప్యూటీ సిఎఫ్‌ శ్రీ ఫణికుమార్ నాయుడు, విజిలెన్స్‌ అధికారులు శ్రీ రామ్‌కుమార్‌, శ్రీ సురేంద్ర, జిల్లా రవాణా అధికారి శ్రీ కె. మురళి మోహన్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments