28.7.25

విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మాలు ప్రారంభం Maha Samprokshana







విజయవాడ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మాలు ఆదివారం ప్రారంభ‌మ‌య్యాయి.


ఇందులో భాగంగా ఉదయం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం,  వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంటల వ‌ర‌కు యాగ‌శాల‌లో కుంభ రాధనలు, అభి మంత్రణము,  కళాప‌క‌ర్ష‌ణ‌, ఉక్త హోమాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.  

No comments :
Write comments