27.7.25

ఆగస్టు నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి గ్రూప్ ఆలయాలలో విశేష ఉత్సవాలు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం.... Padmavati Ammavari Temple





-  ఆగస్టు 01, 15, 22, 29వ‌ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధులలో విహ‌రించి భక్తులకు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.  

-   ఆగస్టు 8న ఉద‌యం 10 గంట‌లకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం. సాయంత్రం 6 గంట‌లకు స్వర్ణ రథోత్సవం.

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో..

-    ఆగస్టు 13న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు స్వామివారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్ర‌హించ‌నున్నారు.
 
శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో ..

-  ఆగస్టు 16న గోకులాష్ఠమి సందర్భంగా పెద్దశేష వాహనంపై స్వామివారు క‌టాక్షించ‌నున్నారు.

•  ఆగస్టు 17న ఉట్లోత్సవం, ఆస్థానం

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో...

-   ఆగస్టు 26న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తిరుచానూరు శ్రీనివాస ఆలయం

ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీలలో వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మూలవర్లకు అభిషేకం.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట...

-   ఆగ‌స్టు 1, 8, 15, 22, 29వ‌ తేదీలలో శుక్ర‌వారం సంద‌ర్భంగా ఉద‌యం 7 గంట‌లకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం.

-   ఆగ‌స్టు 3, 10, 17, 24, 31వ‌ తేదీలలో శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారికి ఉద‌యం 8.15 గంట‌లకు అభిషేకం.

-    ఆగ‌స్టు 5న మంగ‌ళ వారం ఉద‌యం 8 గంట‌లకు అష్టదళ పాదపద్మారాధన సేవ.

-    ఆగ‌స్టు 9న శ్రవణ నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంట‌లకు కల్యాణోత్సవం.

-    ఆగ‌స్టు 13న ఉదయం 8 గంట‌లకు అష్టోత్తర శత కలశాభిషేకం.

No comments :
Write comments