17.7.25

శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప అభయం Pushpa Pallaki seva













తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది.


వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ శ్రీ రామకృష్ణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments