26.7.25

ఆగస్టు నెలలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు Sri Govindaraja Swamy Vari Temple

 




ఆగ‌స్టు 1న స్వాతి నక్షత్రంను పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారు అహోబిలం మఠానికి ఊరేగింపుగా తీసుకువచ్చి ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.


-    ఆగ‌స్టు 6న తుల‌సీ మ‌హ‌త్యం ఉత్స‌వం సంద‌ర్భంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు గరుడ వాహనంపై భక్తులను క‌టాక్షించ‌నున్నారు.

-    ఆగ‌స్టు 8వ తేదీ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం.

-   ఆగస్టు 08, 15, 22, 29 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

-    ఆగ‌స్టు 9న శ్రావణ ఉపకర్మ సంద‌ర్భంగా ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణ స్వామివారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్‌తీర్ధంకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి, స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు. అనంత‌రం సాయంత్రం శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహిస్తారు.

-   ఆగ‌స్టు 16న గోకులాష్టమి సంద‌ర్భంగా సాయంత్రం శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, అనంతరం బంగారు వాకిలి చెంత పురాణ ప్రవచనం, గోకులాష్టమి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

 -    ఆగస్టు 17న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

-      ఆగ‌స్టు 19న చిన్న వీధి ఉట్లోత్స‌వం, ఆగ‌స్టు 20న పెద్ద వీధి ఉట్లోత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.

 - ఆగష్టు 25న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు మాడ వీధులలో విహరిస్తారు.

No comments :
Write comments