12.7.25

శ్రీవారి సేవలో సంస్కరణలపై టీటీడీ ఈవో సమీక్ష TTD EO Reviews Reforms





శ్రీవారి సేవ స్వచ్చంద వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణలపై టీటీడీ ఈవో శ్రీ జే.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా త్వరలో ప్రారంభించనున్న ప్రొఫెషనల్ శ్రీవారి సేవ, ఎన్ఆర్ఐ సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల కార్యాచరణ పురోగతి గురించి సుదీర్ఘoగా చర్చించారు.

ఐఐఎం-అహ్మదాబాద్ బృందంచే గ్రూప్ సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలని ఈఓ ఈ సందర్బంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను మరింత ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు కృషి చేయాలన్నారు. 

ఈ సందర్బంగా IT డిపార్ట్మెంట్ పవర్ పాయింట్ ద్వారా గ్రూప్ సూపెర్వైసర్ కొరకు రూపొందించిన అప్లికేషన్ ను చూపించారు. అదే విధంగా ఎన్ఆర్ఐ సేవ, Professional సేవలను కూడా త్వరిత గతిన ప్రారంభించాలని, NRI సేవలను విస్తరించేందుకు APNRT సంస్థతో సంప్రదింపులు చేయాలని శ్రీవారి సేవ అధికారులను ఈఓ ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో ట్రాన్స్ పోర్ట్ మరియు IT జీఎం శ్రీ శేషారెడ్డి, సీపీఆర్వో డా. టీ.రవి, అశ్వినీ ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్. కుసుమ కుమారి, పి ఆర్ ఓ కుమారి. నీలిమ ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments