19.7.25

తిరుమలలోని పాత భవనాలను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి - TTD Eo









తిరుమలలోని పాత భవనాలను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఉపయోగంలోకి తీసుకురావాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో నిరుపయోగంగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ భవనాన్ని శుక్రవారం ఉదయం అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పరిశీలించారు.


ఈ సందర్భంగా భవన పరిస్థితిపై ఆరా తీస్తూ మరమ్మతులు చేయడం లేదా ఆ ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. 

అంతకుముందు హెచ్ వీడీసీ, బాలాజీ నిలయం, తిరుమల మందిరం(ఆంప్రో రెస్ట్ హౌస్) విశ్రాంతి భవనాలను పరిశీలించి పరిస్థితిని బట్టి మరమ్మతులు, పునర్నిర్మాణంపై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పరిశీలనలో టీటీడీ సీఈ శ్రీ సత్య నారాయణ, ఈఈ వేణు గోపాల్, డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, పంచాయతీ & రెవెన్యూ డిప్యూటీ ఈవో శ్రీ వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.

No comments :
Write comments