వరలక్ష్మీ వ్రతం సందర్భంగా జూలై 08వ తేదీ శుక్రవారం రోజున టిటిడి, హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్తంగా సౌభాగ్యం నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సౌభాగ్యం సామాగ్రికి శ్వేతా భవనంలోని హాలులో గురువారం టిటిడి, డిపిపి అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాల వారీగా పార్శల్ ప్యాకెట్లు సిద్ధం చేశారు.
వరలక్ష్మీ వ్రతం రోజున టిటిడి ఆలయాలలో సౌభాగ్యం పేరుతో మహిళలకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాలలో సౌభాగ్యవతులకు గాజులు, శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, శ్రీ పద్మావతీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను అందించనున్నారు.
ఈ సందర్భంగా సుమంగళి ద్రవ్యాలను సౌభాగ్యవతులకు పంపిణీ చేసేందుకు ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా అందించారు. విరాళం అందించిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 8 లక్షల గాజులు, 1.40 లక్షల కంకణాలు, 1.40 లక్షల పసుపు దారాలు, 1.40 లక్షల అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను సదరు ఆలయాలకు తరలించారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్ సంచాలకులు శ్రీరామ్ రఘునాథ్, అదనపు సంచాలకులు శ్రీ రాంగోపాల్, ఏఈవో శ్రీరాములు, సూపరింటెండెంట్ శ్రీ ఢిల్లీ రెడ్డి, శ్రీవారి సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments