1.8.25

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం Srirama Pattabhishekam







వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం 11 - 12 గం.ల వరకు శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది.


ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. త‌రువాత‌  యాగశాల పూజ, ఉద‌యం 6.30 గంట‌ల‌కు స్నపన తిరుమంజనం జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చంద‌నంల‌తో స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వ‌హించారు.

సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌ సేవ, రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, అర్చ‌కులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments