17.8.25

ఆగస్టు 16, 17వ తేదీలలో రాజనాల బండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి తిరునాళ్లు Prasanna Anjaneya Swamy Vari Temple




చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలోని రాజనాల బండ గ్రామంలో వెలసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆగస్టు 16, 17వ తేదీల్లో తిరునాళ్లు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 


ఇందులో భాగంగా ఆగస్టు 16వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి అభిషేకం నిర్వహించారు.  రాత్రి 8 గంటలకు అఖండ దీపారాధన జరగనుంది. రాత్రి 9 నుండి ఆగస్టు 17వ తేదీ ఉదయం 5 గంటల వరకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

ఆగస్టు 17వ తేదీ ఉదయం 8 నుండి 11 గంటల వరకు పరిసర గ్రామాల దేవతామూర్తులు రాజనాల బండ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయానికి వేంచేపు చేస్తారు. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు ఉట్లోత్సవం నిర్వహిస్తారు.

No comments :
Write comments