తిరుమల శ్రీ
శ్రీవారి ఆలయంలోని బంగారు వాకి లి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థా నం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీ కృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదే వి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృ ష్ణస్వామివారికి ఏకాంత తిరుమం జనం నిర్వహిస్తారు. అనంతరం ద్వా దశారాధనం చేపడతారు.
ఆగస్టు 17న తిరుమలలో ఉట్లోత్సవా న్ని వైభవంగా నిర్వహిస్తారు. సా యంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వా మివారు బంగారు తిరుచ్చిపై, శ్రీ కృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో పాల్గొ ని ఉట్లను కొడుతూ భక్తులకు ఆనం దాన్ని పంచుతారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 17న శ్రీవారి ఆలయంలో ని ర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్ రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సే వలను టీటీడీ రద్దు చేసింది.

No comments :
Write comments