10.8.25

ఆగస్టు 16న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆడికృత్తిక aadi krutika




తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీన ఆడికృత్తిక పర్వదినం జరగనుంది.


ఈ సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

No comments :
Write comments