26.8.25

శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 4 నుండి 6వ తేదీ వ‌ర‌కు పవిత్రోత్సవాలు




నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 4 నుండి 6వ తేదీ వ‌ర‌కు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.

ఇందులోభాగంగా సెప్టెంబ‌రు 4న సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబ‌రు 5న యాగశాలలో పవిత్రమాలలకు పూజలు, ర‌క్షాబంధ‌నం నిర్వహిస్తారు. అదేవిధంగా సెప్టెంబ‌రు 6న ఉదయం మ‌హా పూర్ణాహుతి, యాగశాలపూజ, పట్టుపవిత్రాలను స్వామి, అమ్మ‌వార్లు, ప‌రివార దేవ‌త‌ల‌కు సమర్పిస్తారు.

No comments :
Write comments