కార్వేటినగరం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 6 నుండి 8వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
ఇందులో భాగంగా మొదటి రోజు ఆగష్టు 6న శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ఆగష్టు 7, 8వ తేదీల్లో శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
No comments :
Write comments