ప్రజలందరి
భాగస్వామ్యంతో మరింత విస్తృతంగా సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు చెప్పారు. దేశ విదేశాల నుండి తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు కల్పిస్తున్నామని ఇందుకు కృషి చేస్తున్న అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నానని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలిపారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానంలో టీటీడీ ఛైర్మన్, ఈవో శ్రీ జె.శ్యామలరావుతో కలిసి శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు తొలుత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తరువాత భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఛైర్మన్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. వారి ప్రసంగం యథాతథంగా..
అందరికీ 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో యోధుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎందరో వీరుల త్యాగఫలంగా సిద్ధించిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని మనం జాతీయ పర్వదినంగా జరుపుకుంటున్నాం. భారతదేశం ప్రపంచంలోనే 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడుతుందని తెలిపారు. ఈ శుభసమయాన శ్రీనివాసుడు మనందరికీ సకలశుభాలు కలగజేయాలని ప్రార్థిస్తున్నాను.
- రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మరింత వేగంగా, సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
• తిరుమలలో శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాల్లో మరింత నాణ్యత పెంచి ఎక్కువ మందికి అందిస్తున్నాం. అదేవిధంగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నాం. ఇందుకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది.
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ప్రతి మూడు గంటలకు ఒకసారి అన్నప్రసాదాలు, చిన్న పిల్లలకు పాలు అందిస్తున్నాం.
• తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ఈ ఏడాది మార్చి నుండి భక్తులకు వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించాం.
• తిరుమలలో శ్రీవాణి టికెట్లు పొందే భక్తుల సౌకర్యార్థం ఇటీవల అత్యాధునిక సౌకర్యాలతో నూతన టికెట్ల జారీ కేంద్రం అందుబాటులోనికి తీసుకువచ్చాం.
• భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవాణి టికెట్లు ఉదయం జారీ చేసి, అదేరోజు సాయంత్రం 5 గంటలకు దర్శనం కల్పిస్తున్నాం.
• తిరుమల కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు మరింత సౌకర్యవంతంగా సమర్పించేలా కల్యాణకట్టను అత్యాధునికంగా దశలవారీగా అభివద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
- తిరుమల అటవీ ప్రాంతంలో110 శాతానికి పచ్చదనాన్ని పెంపొందించేందకు చర్యలు చేపట్టాం.
- తిరుమల భద్రతా చర్యల్లో భాగంగా యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుంన్నాం.
- తిరుమలలో తాగునీరు, ఆహార పదార్థాలు, ముడి సరుకులు, నెయ్యి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిక్షించేందుకు నూతన ల్యాబ్ నిర్మాణానికి స్థలం కేటాయించాం.
• టిటిడి అనుబంధ ఆలయాలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. మొదటి విడతగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి, నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి, అమరావతి శ్రీ వేంకటేశ్వర స్వామి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయాలతో పాటు
No comments :
Write comments