21.8.25

అమరావతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ amaravati venkateswara swamy vari temple




అమరావతి (వేంకటపాలెం) శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స‌స్వామివారి ఆలయంలో బుధ‌వారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ  జరిగింది.


ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వహించారు. అనంత‌రం యాగ‌శాల‌లో పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధానహోమములు జ‌రిగాయి.

ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగాఅభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. మూల‌వ‌ర్త‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు, విష్వక్సేన, ద్వారపాలకులు, భాష్యకార్లు, గరుడాళ్వార్‌, బలిపీఠంధ్వజస్తంభం, ప‌రివార దేవ‌త‌ల‌కు పవిత్రాలు సమర్పించారు.

సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో సూప‌రింటెండెంట్ శ్రీ మ‌ల్లికార్జున‌, టెంపుల్ ఇన్స్పెక్ట‌ర్లు శ్రీ రామ‌కృష్ణ‌, శ్రీ సందీప్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments