పద కవితా పితా
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, అన్నమయ్య కీర్తనలపై ప్రాంతీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి యువతను భాగస్వామ్యం చేయాలని సూచించారు. తద్వారా అన్నమయ్య కీర్తనలను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లవచ్చని తెలిపారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ వాగ్గేయ కారుడు అన్నమయ్య 14, 973 కీర్తనలను ఆలపించారని, ఇందులో 4,850 కీర్తనలను ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ రికార్డు చేసి 4,540 కీర్తనలను మాత్రమే అప్ లోడ్ చేశారని, మిగిలిన కీర్తనలను కూడా సకాలంలో రికార్డ్ చేసి భక్త ప్రపంచానికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నమయ్య కీర్తనలను మరింతగా యువతకు అందించి, ప్రాచుర్యంలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కు తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. టిటిడి నిబంధనల మేరకు నవతరం గాయకులతో అన్నమయ్య కీర్తనలను రికార్డ్ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. కాలానుగుణంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డిజిటల్ వ్యవస్థ ద్వారా అన్నమయ్య కీర్తనలను నవతరానికి అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ కె. రాజగోపాల్, అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు డా. సి. లత, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ ఆకెళ్ల విభీషణ శర్మ పాల్గొన్నారు.
No comments :
Write comments