8.8.25

శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం karvetinagaram









కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు.


ఇందులో భాగంగా ఉద‌యం సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొల్పి మూలవర్లకు అభిషేకం నిర్వహించారు.

అనంతరం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఆలయ ఊంజల మండపంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. 

 అనంతరం శ్రీ వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని ఆలయ అర్చకులు తెలియజేశారు.
   
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ర‌వి, సూపరింటెండెంట్‌ శ్రీ ముని శంక‌ర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments