10.8.25

పూర్ణాహుతితో ముగిసిన తొండ‌మాన్‌పురం శ్రీ ప్రసన్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి పవిత్రోత్సవాలు pavitrotsavams



తొండ‌మాన్‌పురం శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ ప్రసన్న


 వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో శనివారం ఉదయం పూర్ణాహుతితో పవిత్ర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.


ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన, పవిత్ర విసర్జన, మహా పూర్ణాహుతి నిర్వహించారు. 

ఉద‌యం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవర్లను స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం చేశారు.  

సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు. 

ఈ కార్యక్రమంలో ఆలయ సూప‌రింటెండెంట్ శ్రీ జ్ఞాన‌ప్ర‌కాష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ సుదీర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

No comments :
Write comments