తిరుమలలో శనివారం రాత్రి శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది.
రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
ఈ పౌర్ణమి గరుడ సేవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే ప్రతిష్టాత్మక గరుడ సేవకు ముందు జరుగుతున్న కారణంగా టీటీడీ ఒక పరిశీలనాత్మక గరుడ సేవను నిర్వహించింది.
ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి వివిధ విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవ గరుడ సేవలో వీలైనంత ఎక్కువ మంది భక్తులు వాహన సేవను తిలకించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని వారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు శ్రీమతి రంగశ్రీ, శ్రీ దివాకర్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







No comments :
Write comments