17.8.25

చెన్నై టీ.నగర్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ T Nagar Temple











టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు శనివారం చెన్నై టీ.నగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనం అందించారు.


ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ టీ.నగర్ ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, గర్భాలయ విమాన గోపుర నిర్మాణం కోసం ఇంజనీరింగ్ అధికారులను ప్రణాళిక సిద్ధం చేయమని ఆదేశించినట్టు తెలిపారు. త్వరలో లోకల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి చెన్నైలోని రెండు టీటీడీ ఆలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మించాలని సంకల్పించామని, ఇప్పటికే 9 రాష్ట్రాల్లో ఆలయాలు ఉండగా మిగతా రాష్ట్రాల్లో స్థల కేటాయింపుల కోసం చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ కుమరగురు, మాజీ ఎల్ఏసి చైర్మన్లు శ్రీ శేఖర్ రెడ్డి, శ్రీ నూతలపాటి కృష్ణ, మాజీ సభ్యులు శ్రీ చంద్రశేఖర్, శ్రీ శంకర్ తదితరులు పాల్గొని చైర్మన్‌ను సన్మానించారు.

No comments :
Write comments