17.8.25

తాళ్ళ‌పాక శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆల‌యంలో ముగిసిన పవిత్రోత్సవాలు Tallapaka Temple




అన్నమయ్య జిల్లా తాళ్ళ‌పాక‌లోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయాల‌లో గత మూడు రోజులుగా జరుగుతున్న పవిత్ర ఉత్సవాలు శనివారం ఉదయం మహా పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి


ఇందులో భాగంగా ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామివారికి యాగశాలలో వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో నిత్య హోమం, పవిత్ర పూజ, పరివార దేవతలకు పవిత్ర సమర్పణ, మహా పూర్ణాహుతి జరిగింది.   

సాయంత్రం 5 గంటలకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు.    

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దిలీప్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments