8.8.25

తెప్ప‌పై శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామి విహారం teppotsavam




కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్స‌వాలలో భాగంగా రెండ‌వ రోజైన గురువారం స్వామివారు తెప్ప‌పై  భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.


ఇందులో భాగంగా ఉద‌యం 9.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తెనే, ప‌సుపు, చంద‌నంల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్స‌వం నిర్వ‌హించారు.


సాయంత్రం 6.30 గంటలకు శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై 7 చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు.

ఆగష్టు 08న శుక్రవారం రాత్రి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి 09 రౌండ్లు తెప్పలపై విహరించి భక్తులను ఆశీర్వదిస్తారు.  

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ర‌వి, సూపరింటెండెంట్‌ శ్రీ ముని శంక‌ర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ సురేష్ కుమార్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments