31.8.25

తిరుప్పావై ఉపన్యాసాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం tiruppavai




పవిత్రమైన ధనుర్మాసంలో 2025 డిసెంబరు 16 నుంచి 2026 జనవరి 14వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్యాసాలు చేసేందుకు సమర్థులైన శ్రీవైష్ణవ సిద్ధాంతం తెలిసిన పండితుల నుంచి దరఖాస్తులు, అంగీకార పత్రాలను టిటిడి ఆహ్వానిస్తోంది.

టిటిడి ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ధనుర్మాసంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైనవారు ఈ ఏడాది సెప్టెంబ‌రు 1 నుండి 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ''ప్రత్యేకాధికారి, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్వేత భవనం, టిటిడి, తిరుపతి'' అనే చిరునామాకు దరఖాస్తులు, అంగీకార పత్రాలు పంపాల్సి ఉంటుంది. అంగీకార పత్రాలు ఇచ్చే పండితుల పట్టికతోపాటు, షరతులు, దరఖాస్తులను www.tirumala.org వెబ్‌సైట్‌ నుంచి పొందొచ్చు.
ఇతర వివరాలకు టిటిడి ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు కార్యాలయాన్ని సెల్‌ : 9676120226, 8978734947 నంబర్ల ద్వారా సంప్రదించగలరు.

No comments :
Write comments